తెలంగాణకి వస్తే టూరిస్ట్.. మరి ఢిల్లీకి వెళ్లిన వాళ్లని ఏమనాలి? మన వాళ్లు వెళ్లి దేశ రాజధానిలో రాజకీయాలు చేస్తారు కదా. అప్పుడు వాళ్లని ఏమని పిలుస్తారు? ఒక రాష్ట్రం వాళ్లు మరో రాష్ట్రానికి వెళ్లి పాలిటిక్స్ చేయొద్దా? కేటీఆర్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు ఈ ప్రశ్నలకి సెంటర్ పాయింట్ అయింది.
కేటీఆర్ – రేవంత్ రెడ్డి ట్విట్టర్ వార్
ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే యంగ్ లీడర్ కేటీఆర్ నిన్న మరో ట్వీటేశారు. ‘‘రాజకీయ పర్యాటకులు వస్తారు, పోతారు. తెలంగాణలో ఉండేది కేసీఆర్ మాత్రమే’’ అంటూ రాహుల్ గాంధీకి సెటైర్ వేశారు. నిన్న రాహుల్ గాంధీ వరంగల్ లో చేసిన పర్యటనని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారని రాజకీయాలపై ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా ఈజీగా అర్థమవుతుంది.
పాలిటిక్స్ లో ట్వీట్ కి రీ ట్వీట్ లు… పంచ్ లు, ప్రాసలు కామన్. సభల్లో మాటకు మాట ఎలాగో ట్వీట్టర్ లో ఇది అలాంటిదే. అలాగే కేటీఆర్ ట్వీట్ ఇవ్వడం ఆలస్యం. కాంగ్రెస్ నుంచి ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ వచ్చింది. రేవంత్ రెడ్డి.. కేటీఆర్ చేసిన ట్వీట్ ని ఉద్దేశిస్తూ ‘‘కేటీఆర్ గారూ… మీ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చు. కాంగ్రెస్ దృష్టిలో మాత్రం ఈ రాష్ట్రం అమర వీరుల త్యాగఫలం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. మీ వక్ర దృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా… దానిని సృష్టించింది కూడా కాంగ్రెసే.’’ అంటూ ట్వీట్ చేశారు. అంటే ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది తామే అని చెప్పకనే చెప్పారు. పైగా అమరవీరుల సెంటిమెంట్ ని కూడా జోడించి తెలంగాణ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
రాజకీయ టూరిస్టులు ఎవరు?
ఈ ఇద్దరు లీడర్లు చేసిన ట్వీట్లు మెయిన్ గా ఒక ప్రశ్నని లేవనెత్తాయి. రాజకీయ పర్యాటకులు ఒక్క తెలంగాణకే వస్తూ ఉంటారా..? వాళ్లని టూరిస్టులు అంటే… మరి దేశ రాజధాని ఢిల్లీకి వేరే రాష్ట్రాల నుండి చాలా మంది వెళుతూ ఉంటారు. వాళ్లని ఏమనొచ్చు. అంతే కాదు. ఎంపీలు, ఇతర నేతలు, ఆఖరికి ముఖ్యమంత్రులు కూడా తమ రాష్ట్ర పనులకోసం ఢిల్లీకి పోవాల్సిందే. కేసీఆర్ కూడా ఢిల్లీలో చాలా మ్యాటర్లు సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది. పైగా టీఆర్ ఎస్ కాదు… బీఆర్ ఎస్ అని.. తాము జాతీయ రాజకీయాల వైపు వెళుతున్నామంటూ… ప్లీనరీలో కేసీఆర్ ఆల్రడీ చెప్పేశారు. నేషనల్ పాలిటిక్స్ కి మెయిన్ సెంటర్ ఢిల్లీయే కదా. అప్పుడు కేసీఆర్ దేశ రాజధానిలో రాజకీయాలు చేయాల్సివస్తుంది. అప్పుడు ఆయన్ని ఏం అనాలి. అన్నది ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద క్వశ్చర్ అయి కూర్చుంది.
గులాబీ పార్టీ వర్కింగ్ మరి ఏం ఆలోచించకుండా ఈ ట్వీట్ వేశారా? లేదా కావాలనే అన్నారా? అంటే ఏం చెప్పలేం. వాస్తవానికి బంతిని కొడితే తిరిగి మనకే తగులుతుంది. ఈ ట్వీట్ వార్ కూడా అలాగే అయింది.