మడోన్నా కూడా తప్పుకుందా?
ఇప్పుడు మీనాక్షి ఆదుకుంటుందా?రీ నచ్చి ప్రాజెక్ట్ లోకి అడుగు పెడుతున్నారు హీరోయిన్స్.
ముద్దులు బూతు డైలాగ్స్ ఉండే సరికి భయపడి వెనకడుగు వేస్తున్నారని సమాచారం.
తొలుత శ్రీలీల, ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్, రీసెంట్ గా మడోన్న సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం హీరోయిన్ రోల్ కోసం సిద్ధూ హిట్ -2 కథానాయిక మీనాక్షి చౌదరితో చర్చలు జరుపుతున్నాడట.
శ్రీలీల ఒక షెడ్యూల్లో పాల్గొంది. అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక షెడ్యూల్ పూర్తి చేసింది. మడోన్న మాత్రం అయిష్టంగానే ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టింది. అంతే అయిష్టంగా నటించింది. దాంతో సిద్ధూనే ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మీరు ఆలోచించుకోండి అన్నాడట. ఆ తర్వాతే మడోన్నా ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చేసిందట. ప్రస్తుతం చిత్ర యూనిట్ మీనాక్షి తో టిల్లు స్క్రేవ్ తెరకెక్కించేందుకు సిద్ధమవుతోందట. హర్యానాకు చెందిన ఈ బ్యూటీ 2018 ఇండియా తరపును మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లో పాల్గొంది. లాస్ట్ ఇయర్ ఇచట వాహనాలు నిలుపరాదు చిత్రంతో తెలుగువారిని పలకరించింది. ఆ తర్వాత ఖిలాడీలో కనిపించింది. ఇఫ్పుడు హిట్ -2లో హిట్ కొట్టింది. ఆ వెంటనే డీజే టిల్లు సీక్వెల్లో నటంచే ఛాన్స్ కొట్టేసింది.