టీపీసీసీ కొత్త కమిటీలు.. కోమటిరెడ్డికి షాక్ 

By KTV Telugu On 11 December, 2022
image
టీపీసీసీ కొత్త కమిటీలను AICC ప్రకటించింది. 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీ, 18 మందితో కూడిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ప్రకటించింది. 26 జిల్లాలకు నూతన అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించింది. గ్రేటర్ హైదరాబాద్ ను మూడు విభాగాలుగా విభజించి బాధ్యతలు అప్పగించారు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లుగా జగ్గారెడ్డి, అంజన్ కుమార్, అజారుద్దీన్, మహేష్ గౌడ్ ను నియమించింది. కాగా ఈ కొత్త కమిటీల సారథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రేవంత్ రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.  ఈ జాబితాలో నల్గొండ జిల్లా సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి  పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
టీపీసీసీ ఎగ్జిక్యూటీవ్ కమిటీ
1. రేవంత్ రెడ్డి – (పీసీసీ చీఫ్, చైర్మన్)
2. మల్లు భట్టి విక్రమార్క
3. వి. హనుమంతరావు
4. పొన్నాల లక్ష్మయ్య
5. ఉత్తమ్ కుమార్ రెడ్డి
6. కే. జానారెడ్డి
7. టి. జీవన్ రెడ్డి
8. జే. గీతారెడ్డి
9. ఎండీ. షబ్బీర్ అలీ
10. దామోదర రాజ నర్సింహా
11. రేణుకా చౌదరి
12. బలరాం నాయక్
13. మధు యాష్కి గౌడ్
14. డి. సుధీర్ బాబు
15. జి. చిన్నారెడ్డి
16. చల్లా వంశీచంద్ రెడ్డి
17. ఎస్ఏ. సంపత్ కుమార్
18. పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి
19. ఆర్. దామోదర్ రెడ్డి
20. సంభాని చంద్రశేఖర్
21. నాగం జనార్థన్ రెడ్డి
22. గడ్డం ప్రసాద్ కుమార్
23. సి. రామచంద్రారెడ్డి
24. కొండా సురేఖ
25. జి. వినోద్
26. మహ్మద్ అజారుద్దీన్
27. ఎం. అంజన్ కుమార్ యాదవ్
28. టి. జగ్గారెడ్డి
29. బి. మహేశ్ కుమార్ గౌడ్
30. డి. సీతక్క
31. పోదెం వీరయ్య
32. అలేటి మహేశ్వర్ రెడ్డి
33. ప్రేమ్ సాగర్ రావు
34. పొన్నం ప్రభాకర్
35. జెట్టి కుసుమ్ కుమార్
36. కోదండ రెడ్డి
37. ఎరవాటి అనిల్ కుమార్
38. వేం నరేందర్ రెడ్డి
39. మల్లు రవి
40. సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని
పొలిటికల్ అఫైర్స్ కమిటీ 
1. మాణిక్యం ఠాగూర్ – (చైర్మన్)
2. రేవంత్ రెడ్డి
3. మల్లు భట్టి విక్రమార్క
4. పొన్నాల లక్ష్మయ్య
5. వి. హనుమంతరావు
6. ఉత్తమ్ కుమార్ రెడ్డి
7. కే. జానారెడ్డి
8. టి. జీవన్ రెడ్డి
9. జే. గీతారెడ్డి
10. మహ్మద్ షబ్బీర్ అలీ
11.దామోదర రాజ నర్సింహా
12. రేణుకా చౌదరి
13. పి. బలరాం నాయక్
14. మధు యాష్కి గౌడ్
15. చిన్నా రెడ్డి
16. శ్రీధర్ బాబు
17. వంశీ చంద్ రెడ్డి
18. సంపత్ కుమార్
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు (పీఏసీ ప్రత్యేక ఆహ్వానితులు)  
1. ఎండీ అజారుద్దీన్
2. అంజన్ కుమార్ యాదవ్
3. టి. జగ్గారెడ్డి
5. మహేష్ కుమార్ గౌడ్
కొత్త డీసీసీ అధ్యక్షులు
1. సాజిద్ ఖాన్ – అదిలాబాద్
2. పోదెం వీరయ్య – భద్రాద్రి కొత్తగూడెం
3. ఎన్. రాజేందర్ రెడ్డి – హన్మకొండ
4. వలియుల్లా సమీర్ – హైదరాబాద్
5. ఏ. లక్ష్మణ్ కుమార్ – జగిత్యాల
6. పటేల్ ప్రభాకర్ రెడ్డి – జోగులాంబ గద్వాల
7. కైలాస్ శ్రీనివాసరావు – కామారెడ్డి
8. కే. సత్యనారాయణ – కరీంనగర్
9. సి. రోహిన్ రెడ్డి – ఖైరతాబాద్
10. జే. భరత్ చంద్రా రెడ్డి – మహబూబాబాద్
11. జి. మధుసూదన్ రెడ్డి – మహబూబ్ నగర్
12. కే. సురేఖ – మంచిర్యాల
13. టి. తిరుపతి రెడ్డి – మెదక్
14. నందికంటి శ్రీధర్ – మేడ్చల్ మల్కాజిగిరి
15. ఎన్. కుమారస్వామి – ములుగు
16. సి. వంశీ క్రిష్ణ – నాగర్ కర్నూల్
17. టి. శంకర్ నాయక్ – నల్గొండ
18. శ్రీహరి ముదిరాజ్ – నారాయణ్‌పేట
19. ప్రభాకర్ రెడ్డి – నిర్మల్
20. ఎం. మోహన్ రెడ్డి – నిజామాబాద్
21. ఎంఎస్. రాజ్ ఠాకూర్ – పెద్దపల్లి
22. ఆది శ్రీనివాస్ – రాజన్న సిరిసిల్ల
23. టి. నర్సారెడ్డి – సిద్దిపేట
24. టి. రామ్మహన్ రెడ్డి – వికారాబాద్
25. ఎం. రాజేంద్ర ప్రసాద్ యాదవ్ – వనపర్తి
26. కే. అనిల్ కుమార్ రెడ్డి – యాదాద్రి భువనగిరి