నన్ను అడిగిన మాట నిజమే
కాని నేను ఆ క్యారెక్టర్ చేయలేను
వారసుడు తర్వాత తమిళ హీరో విజయ్ విక్రమ్ దర్శకుడితో చేతులు కలుపుతున్నాడు.
మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.
విజయ్ మూవీకి కూడా ఇద్దరు హీరోల కాన్సెప్ట్ అప్లై చేయాలనుకున్నాడు లోకేష్ కనగరాజ్.
అందులో భాగంగా కొత్త చిత్రంలో విజయ్ కు విలన్ గా మారాల్సిందిగా సంప్రదించాడు.
అయితే విశాల్ ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసాడు.
విజయ్ సినిమాలంటే తనకెంతో ఇష్టం అని తనకు తన దర్శకత్వంలో నటించాలని ఉందని
కాకపోతే తనకున్న కమిట్ మెంట్స్ కారణంగా విజయ్ సినిమా చేయడం లేదని క్లారిటీ ఇచ్చేశాడు విశాల్.
త్వరలో లాఠీ చార్జ్ అనే మూవీ చేస్తున్నాడు విశాల్.
ఈ సినిమా విడుదల తర్వాత ఇంకా చాలా చిత్రాల్లో విశాల్ చేయాల్సి ఉంది.
ఆల్రెడీ డేట్స్ కేటాయించి ఉండటంతో విజయ్ మూవీకి నో చెప్పాడు పందెంకోడి.
విశాల్ విలన్ గా చేయడానికి నిరాకరించడంతో లోకేష్ ఎవర్ని సంప్రదించబోతున్నాడు అనేది ఇఫ్పుడు ఆశక్తికరంగా మారింది. ఎందుకంటే మాస్టర్ లో విజయ్ తో విజయ్ సేతుపతిని విలన్ గా నటింపజేసాడు.
విక్రమ్ లో కమల్ కు కూడా విజయ్ సేతుపతినే విలన్ గా నటించాడు.
మరి కొత్త చిత్రంలో ఆ ఆఫర్ ను ఎవరు అందుకోనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.