భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.ప్రస్తుతం రాజస్థాన్ గుండా కొనసాగుతున్న రాహుల్ గాంధీనేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో రాజన్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అప్పుడు రాజస్థాన్ రెబెల్ లీడర్ సచిన్ పైలట్ కూడా వారితో ఉన్నారు. రాజస్థాన్లోని సవాయి మాధోపూర్ దగ్గరి భడోతి నుంచి పాదయాత్ర ప్రారంభమైనప్పుడు రాజన్ వచ్చి రాహుల్ ను కలిశారు. ఇద్దరు ఉత్సాహంగా, ఉల్లాసంగా మాట్లాడుకుంటూ వెళ్లారు. ఐఐటీలో చదివిన తర్వాత అర్థశాస్త్రంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాజన్ ఆర్బీఐ గవర్నర్ గా అనేక సంస్కరణలకు ఆద్యం పోశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ కు యాత్రలో చాలా మంది వీఐపీలు రాహుల్ వెంట ఉంటున్నారు. లక్షలాది మంది సామాన్యులు ఆయన్ను చూసేందుకు ఎగబడుతున్నారు. ఇక భారత్ జోడో యాత్ర 100 రోజులు పురస్కరించుకుని శుక్రవారం జైపూర్లో సింగర్ సునిధి చౌహాన్ లైవ్ పర్ఫార్మెన్స్తో కచేరీ నిర్వహించనుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చెప్పారు.