టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్దే, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రేమలో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా
సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ అనే చిత్రంలో కలసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు బీటౌన్ కోడైకూస్తోంది.
ఈ నేపథ్యంలో వీరిద్దరి రిలేషన్షిప్ పై సల్మాన్ స్నేహితుడు ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. పూజా తన కూతురు వయసు అమ్మాయి అని అలా తప్పుగా రాయవద్దు అని ప్రాధేయపడ్డాడు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశాడు.
కలిసి సినిమాల్లో నటించినంత మాత్రానా రిలేషన్లో ఉన్నట్లేనా అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. పబ్లిసిటీ కోసమే ఇలాంటి వార్తలను పుట్టిస్తున్నారు అన్నాడు. ఇకనైనా రూమర్స్ కు బ్రేక్ వేస్తే బెస్ట్ అన్నాడు. ఈ సంగతి ఇలా ఉంటే పూజాకు మరో షాక్ తగిలిందని టాలీవుడ్ సర్కిల్స్ చెప్పుకొస్తున్నాయి. పవన్ కళ్యాన్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నుంచి పూజా హెగ్డేను తప్పించారని సమాచారం. అనుకోకుండా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కావడం, పూజా డేట్స్ అందుబాటులో లేకపోవడంతో, హరీష్ మరో కథానాయిక అన్వేషణలో ఉన్నాడట.