ప్రపంచ వ్యాప్తంగా అవతార్ 2 నయా బాక్సా ఫీస్ రికార్డ్స్ తిరగరాస్తోంది. ఇండియాలోనూ అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. తొలి రోజే ఇండియాలో 40 కోట్లకు పైగా వసూళ్లను అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు రెండు రోజుల్లో 100 కోట్లు మార్క్ ను దాటింది. దాంతో ఈ సినిమా చూడటం కోసం సినీ అభిమానులు ఎంతగా ఆసక్తిగా ఉన్నారో అర్ధమవుతోంది.
ఇండియాలో రెండు రోజుల్లో 100 కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఇలాంటి రికార్డ్ బాలీవుడ్ ఇండస్ట్రీ కి కూడా సాధ్యం కాదు. మరో వైపు తెలుగు రాష్ట్రాలు అవతార్ -2 కలెక్షన్స్ కు పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నాయి.
తొలిరోజు 13 కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నాయి. రెండో రోజు వసూళ్లలో కొద్దిగా డ్రాప్ కనిపించింది.
కాని కలెక్షన్స్ మాత్రం స్టడీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల వసూళ్లు కలుపుకుంటే 25 కోట్లు దాటినట్లే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇండియా వైడ్ గా అవతార్ -2 వసూళ్లు 100 కోట్లు అయితే అందులో తెలుగు రాష్ట్రాల వాటా 25 కోట్లు. మరోసారి టాలీవుడ్ ఇక్కడ లీడింగ్ రోల్ పోషించిందనే చెప్పాలి.