ఒక వైపు తమిళనాడులో విజయ్ నటిస్తున్న వారసుడు కు కేవలం 400 స్క్రీన్స్ మాత్రమే కేటాయిస్తారు అని డిస్ట్రీబ్యూటర్లు చెప్పుకొస్తున్నారు. అవతలి వైపు అజిత్ నటిస్తున్న తునీవు అనే సినిమా ఉండటంతో రెండు సినిమాలకు సరిసమానంగా స్క్కీన్స్ ను పంచుతున్నారు అక్కడి డిస్ట్రీబ్యూటర్లు. కాని తెలుగు రాష్ట్రాల్లో ఒక వైపు ఇంకో వైపు బాలయ్య ఉన్నా విజయ్ మూవీకి ఎక్కువ స్క్రీన్స్ కేటాయిస్తుండటం ఇక్కడ వివాదాన్ని తట్టి లేపుతోంది. వాల్తేరు వీరయ్య గా చిరంజీవి, వీర సింహా రెడ్డిగా బాలకృష్ణ ఈ సంక్రాంతి పండగ కోసం బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ అదే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండటంతో వారి పైనే ఆగ్రహంగా ఉన్నాడు దిల్ రాజు.
ఒక నిర్మాణ సంస్థ నుంచి ఒకే సినిమా విడుదల కావాలి. అలాంటిది రెండు సినిమాలు రిలీజ్ కావడం, రెండిటికి ఎక్కువ స్క్రీన్స్ అడిగితే మా పరిస్థితి ఏంటి అనేది దిల్ రాజు అడిగే ప్రశ్ని. అంతే కాదు ఇప్పుడు ఈ రెండు సినిమాలకు కలపి
ఒక్క సినిమా రిలీజ్ అయితే ఎన్ని స్క్రీన్స్ ఇస్తారో అన్నే స్క్రీన్స్ ఇస్తాను అంటున్నాడట దిల్ రాజు. ఇది నిజంగా చిరు, బాలయ్యలను అవమానించడమే అంటున్నారు అభిమానులు. తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు మార్కెట్ లేని హీరోకు అన్ని వందల స్క్రీన్స్ ఎలా ఇస్తారు అంటూ దిల్ రాజును నిలదీస్తున్నారు ఇరువురి హీరోల అభిమానులు. రాను రాను ఈ వివాదం పెద్దది అవుతోంది తప్పితే సమస్యకు పరిష్కారం మాత్రం దొరకడం లేదు.