బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ సవాల్‌

By KTV Telugu On 20 December, 2022
image

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ సవాల్‌ చేశార్‌. డ్రగ్స్‌ పరీక్షకు తాను సిద్ధమని అన్నారు మంత్రి కేటీఆర్‌. టెస్టు కోసం తన రక్తం ఇస్తాను అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్ లో కేటీఆర్‌ మాట్లాడారు. తాను కరీంనగర్‌లోనే ఉంటా ఏ డాక్టర్ని తీసుకొస్తావో తీసుకురా రక్తం, చర్మం, జుట్టు, గోళ్లు ఇస్తా అవసరమైతే కిడ్నీ కూడా ఇస్తా అని అన్నారు. డ్రగ్స్‌ టెస్టు చేయించుకున్నాక తాను క్లీన్ చిట్‌తో బయటకు వస్తే కరీంనగర్‌ చౌరస్తాలో చెప్పుదెబ్బలు తినడానికి సిద్ధమా అని బండి సంజయ్‌ను ప్రశ్నించారు. నా చెప్పు అంటే మళ్లీ ఏమైనా అనుకుంటారు తన చెప్పుతో తాను కొట్టుకుంటాడా అన్నారు. ప్రజలకు అవసరమైన పనులు చేయకుండా ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే ఎలా అన్నారు.

నేను ఇచ్చిన తరువాత మోడీని రక్తం ఇవ్వమంటా అవన్నీ అవసరమా అని ప్రశ్నించారు కేటీఆర్‌. కేటీఆర్ కు డ్రగ్స్ సేవించడం అలవాటు ఉందంటూ ఈ నెల ఆరవ తేదీన నిర్మల్‌లో బండి సంజయ్‌ ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే పరీక్షలు చేయించుకుని సచ్ఛీలుడిగా నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. అంతకుముందు బండి సంజయ్‌కు పొగాకు నమిలే అలవాటు ఉందని కేటీఆర్ చేసిన విమర్శలపై ఆయన ఈ విధంగా స్పందించారు. తాను తన శరీరంలో రక్తం సహా ఏ నమూనాను అయినా పరీక్షల కోసం ఇవ్వడానికి సిద్ధం. నాకు పొగాకు తినే అలవాటు లేదని నిరూపించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రక్తం, వెంట్రకల నమూనాలు ఇచ్చి, తాను డ్రగ్స్ తీసుకోవడం లేదని నిరూపించుకునేందుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు కేటీఆర్‌ తీవ్రంగా రియక్టరయ్యారు. మరి బండి సంజయ్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.