కరోనా కొత్త వేరియంట్ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గుజరాత్లో ఇద్దరికి, ఒడిశాలో ఒకరికి బీఎఫ్ సెవెన్ వైరస్ సోకినట్లు నిర్ధారణ కావటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించింది. జనాభా విస్ఫోటనం ఎక్కువగా ఉండే భారత్‌లో ఏమాత్రం ఆదమరిచినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.