రాఖీభాయ్ తో సినిమా చేసేందుకు అటు బాలీవుడ్ నిర్మాతలు ఇటు తెలుగు ప్రొడ్యూసర్స్ బాగా ప్రయత్నిస్తున్నారు.
బాలీవుడ్ నుంచి కరణ్ జోహర్ అటువైపు నుంచి నరుక్కుంటూ వస్తున్నాడు. యశ్ వస్తానంటే బ్రహ్మాస్త్రలో సీక్వెల్లో హీరో రోల్ ఆఫర్ చేస్తానంటున్నాడు. మరో వైపు తెలుగు నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్,
ప్ర స్తుతం యశ్ తో మూవీ చేసేందుకు బాగా ప్రయత్నిస్తున్నారట.ఇంతకీ ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే యశ్ తో తెలుగు నిర్మాతలు కాని, బాలీవుడ్ నిర్మాతలు కాని, ఇప్పటికిప్పుడు సినిమా చేసేందుకు డేట్స్ లేవు.
వీరి ఫైటింగ్ అంతా మరో నాలుగేళ్ల తర్వాత యశ్ చేయబోయే మూవీ గురించే అట.
అదేంటి అంటే అదో పెద్ద కథ. కేజీయఫ్ 2 సంచలన విజయం తర్వాత యశ్ కన్నడ దర్శకుడి మేకింగ్ లోనే మరో మూవీ చేయాలనుకుంటున్నాడు. అలాగే కేజీయఫ్ 3 కూడా లైన్ లో ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత యశ్ అప్పుడు తెలుగు సినిమా కాని, బాలీవుడ్ మూవీ కాని చేస్తాను అన్నాడట. అప్పుడు చేయబోయే మూవీ కోసం కూడా ఇప్పటికే డేట్స్ లాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేవలం కేజీయఫ్ సిరీస్ తో యశ్ వరల్డ్ వైడ్ గా 1500 కోట్లు కొల్లగొట్టాడు.
అందుకే రాఖీభాయ్ డేట్స్ కు ఇంత గిరాకీ. నాలుగేళ్ల తర్వాతైనా యశ్ టాలీవుడ్ కు ఇంపార్టెన్స్ ఇస్తాడా లేక బాలీవుడ్ వైపు వెళ్తాడా అనేది వచ్చే ఏడాది అతని పుట్టిన రోజున వివరాలు వెల్లడికానున్నాయి. జనవరి 8 హీరో యశ్ బర్త్ డే. ఆ రోజును ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ రానుంది.