పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ హరి హర వీరమల్లు.
ఈ మూవీని క్రిష్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
గత కొద్ది రోజులుగా ఇదే సినిమా షూటింగ్ లో పవన్ బిజీగా ఉన్నాడు.
అందుకోసమే గడ్డెం పెంచాడు.తర్వాత తీసేసాడు.
ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.
మొఘల్ కాలం నాటి కోటను ఆర్ట్ డైరక్టర్ తోట తరణ్ ప్రత్యేకంగా వేసారు.
ఈ సెట్ లోకి ఔరంగజేబు పాత్రలో నటించేందుకు అడుగు పెట్టాడు బాలీవుడ్ నటుడు బాబి డియోల్.
ఈ ఉత్తరాది నటుడికి ఇదే తొలి తెలుగు చిత్రం.
ఒకప్పుడు హిందీ సినీ పరిశ్రమలో డ్రీమ్ బాయ్ గా వెలిగాడు బాబి డియోల్.
ఆ తర్వాత అతని స్టార్ డమ్ పతనం అయింది.
రీసెంట్ టైమ్స్ లో ఆశ్రమ్ వెబ్ సిరీస్ లో నటనకు ప్రశంసలు దక్కించుకున్నాడు.
అదే స్పీడ్ లో ఇఫ్పుడు హరి హర వీర మల్లు సెట్ లోకి అడుగు పెట్టాడు.
గతంలో ఇదే పాత్ర కోసం దర్శకుడు క్రిష్ మరో ఉత్తరాది నటుడు అర్జున్ రాంపాల్ తో చర్చలు జరిపినప్పటికీ,
ఇఫ్పుడు బాబి డియోల్ విలన్ రోల్ కు ఎంపిక అయ్యాడు.