క్రాక్ తర్వాత సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు మాస్ రాజా. ఈ ఏడాది మొదట్లో ఖిలాడీగానూ
ఆ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలతోనూ మెప్పించాలనుకున్నాడు. క్రాక్ లాంటి హిట్ కొట్టాలి అనుకున్నాడు.
కాని ఈ రెండూ కూడా మాస్ రాజా ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్న మసాలాలు సరిగ్గా కలవలేదు.
దాంతో ధమాకాతో మాస్ మాసాలాలు దట్టంగా చల్లి బాక్సాఫీస్ ముందుకు తీసుకొచ్చారు.
యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ కావడం భీమ్స్ సంగీతం ఈ సినిమాకు మాస్ రాజా ఫ్యాన్స్ ను చేరువ చేసింది.
ఇక రవితేజకు ఇలాంటి ఎనర్జిటిక్ క్యారెక్టర్స్ లో నటించడం అంటే కొట్టిన పిండి.
ఈసారి అదే చేసాడు . రెట్టించిన ఉత్సాహంతో డ్యూయల్ రోల్స్ చేయడంతో రెండవ రోజు కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి.
తొలిరోజే 10 కోట్లకు పైగా వసూళ్లను అందుకున్న ధమాకా తొలి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించే దిశగా పరుగులు తీస్తోంది.