ఈ ఏడాది ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డల్ అయ్యారు. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి రాధేశ్యామ్ నిరాశపరిచింది.
రెండు ఆదిపురుష్ పై కాంట్రవర్సీ. కాని న్యూ ఇయర్ లో మాత్రం ఎలాంటి డిస్టర్ బెన్స్ లేకుండా చూసుకోవాలి అనుకుంటున్నాడు యంగ్ రెబల్ స్టార్. అందుకోసమే ఫుల్లుగా అప్ డేట్స్ ఇవ్వబోతున్నాడు.
ఇఫ్పటికే సలార్ షూటింగ్ ను 85 శాతానికి పైగా కంప్లీట్ చేసేసాడట.
వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరో వైపు మారుతి సెట్ లో ప్రభాస్ కనిపించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
ఇంకో వైపు త్వరలోనే నాగీ ప్రాజెక్ట్ కే అప్ డేట్ ఇస్తాడని వైజయంతీ మూవీస్ చెప్పుకొస్తోంది.
ఇక ఆహాలో ప్రభాస్ ఎపిసోడ్ మరో సర్ ప్రైజ్.
మొత్తంగా డైహార్డ్ ఫ్యాన్స్ కు ఇయర్ ఎండ్ ట్రీట్ ను పెద్ద ఎత్తున ప్లాన్ చేసాడు ప్రభాస్.