అన్‌స్టాపబుల్‌ కాంట్రవర్సీ.. పక్కా పాలిటిక్స్‌!

By KTV Telugu On 27 December, 2022
image

అన్‌స్టాపబుల్‌ హోస్ట్‌ నందమూరి బాలకృష్ణ. ఓటీటీలో వచ్చే ఈ ప్రోగ్రాం పబ్లిక్‌ చూడకముందే కాంట్రవర్సీ అవుతోంది. పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారిపోతోంది. బావ కళ్లల్లో ఆనందం చూడటానికి బావమరిది ఈ షోని దిగ్విజయంగా వాడుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆమధ్య చంద్రబాబు, లోకేష్‌లతో అన్‌స్టాపబుల్‌గా మాట్లాడారు బాలయ్య. వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడుకున్నా ఆ ఎపిసోడ్‌లో హైలెట్‌ అయింది మాత్రం పొలిటికల్‌ కంటెంటే.
తాజాగా బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షోకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వచ్చారు. ఇద్దరూ హీరోలు కమ్‌ నాయకులు. అందుకే అన్‌స్టాపబుల్‌గా అన్నీ మాట్లాడుకున్నారు. కేవలం సినిమాలకే పరిమితం కాలేదు వారి డిస్కషన్‌. పాలిటిక్స్‌ని టచ్‌ చేశారు. ఏపీ రాజకీయాలపై బాలయ్య అడిగిన ఎన్నో ప్రశ్నలకు పవర్‌స్టార్‌ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ముందే ప్రకటించుకుంటే పొత్తులు ఎలా సాధ్యమన్న ప్రశ్న కూడా బాలకృష్ణనుంచి వచ్చింది.

ఏపీ రాజకీయాల్లో పొత్తులుంటాయి. టీడీపీతో పొత్తు విషయాన్ని పవన్‌కళ్యాణ్‌ తోసిపుచ్చలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తనవైపునుంచి అన్ని ప్రయత్నాలు ఉంటాయన్నారు జనసేనాని. అవసరమైతే బీజేపీని కూడా ఒప్పించి మూడుపార్టీల కాంబో ఎన్నికల్లో నిలబడే అవకాశాలు ఉన్నాయి. అన్‌స్టాపబుల్‌ షోలో పవన్‌ ఆన్సర్లు చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. బావకి బూస్ట్‌ ఇచ్చేందుకు బాలయ్య ఓటీటీ ప్లాట్‌ఫాంని వాడుకుంటున్నారంటోంది వైసీపీ. బావ తప్పుల్ని సరిచేయడానికి బావ పార్టనర్‌తో మాట్లాడటానికి బాలకృష్ణ ఈ ప్రోగ్రాంని వాడుకుంటున్నారని దెప్పిపొడుస్తున్నారు మాజీ మంత్రి పేర్నినాని. బావ మళ్లీ సీఎం అయితే చక్రం తిప్పేది అల్లుడేగా. బామ్మర్ది ఆ మాత్రం ఫేవర్‌ చేయకూడదా ఏంటీ!