చాలా కాలం తర్వాత సమంత మళ్లీ ఒక ట్వీట్ చేసింది. న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది లేడీ సూపర్ స్టార్. ఏది ఏమైనా సరే ముందుకు వెళ్లాలి మనం వేటినైతే అదుపు చేయగలమో వాటిని కంట్రోల్ చేయాలి అనుసరించగల నిర్ణయాలు తీసుకునేందుకు ఇదే కరెక్ట్ టైమ్ అంటూ పోస్ట్ రాసుకొచ్చింది సమంత.
ప్రస్తుతం ఈ ట్వీట్, ఈ పోస్ట్ రెండూ వైరల్ అవుతున్నాయి. పైగా సామ్ హ్యాపీగా నవ్వుతున్న ఫోటో పెట్టుకురావడంతో
ఆమె రీఎంట్రీ కన్ ఫామ్ అయిపోయిందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. న్యూ ఇయర్ లో సమంత కోసం చాలా సినిమాలు ఎదురు చూస్తున్నాయి. శాకుంతలం రిలీజ్ కు రెడీగా ఉంది. విజయ్ దేవరకొండతో చేయాల్సిన బ్యాలెన్స్ ఉండిపోయింది. హిందీలో ఒక వెబ్ సిరీస్ హాలీవుడ్ లో మరో బిగ్ ప్రాజెక్ట్. ఇలా సమంత చేయాల్సిన సినిమాలు వెబ్ సిరీస్ లు ఉన్నాయి. కొద్ది నెలలుగా మయోసైటిస్ వ్యాధితో సమంత పోరాడుతోంది. ఇంటి దగ్గరే ఉండి చికిత్స తీసుకుంటోంది. ఈ దశలో త్వరలో సామ్ పూర్తిగా కోలుకుని సినిమా సెట్ లోకి అడుగు పెట్టే రోజు కోసం
పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.