సలార్ సినిమా 85 శాతం పూర్తైపోయింది. జనవరి ఎండ్ కు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది.
సో ఫిబ్రవరి నుంచి ప్రశాంత్ కేవలం సలార్ కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పైనే ఉంటాడు.
ఈ దశలో తారక్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరితో ప్రశాంత్ ఫ్రీ అవుతున్నాడనే
తారక్ తాను బుచ్చిబాబుతో చేయాల్సిన సినిమాను పక్కనపెట్టాడు.
బుచ్చిబాబు వెళ్లి రామ్ చరణ్ ను కలసి సినిమా ఒకే చేయించుకున్నాడు.
ఈదశలో తారక్ తో సినిమా కు ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నట్లే లెక్క.
అందుకే ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం ప్రశాంత్ నీల్ బాలీవుడ్ స్టార్ హీరో
దంగల్ తో ఎన్నో బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాసిన ఆమిర్ ఖాన్ తో చర్చలు జరుపుతున్నాడట.
వీలైతే ఆమిర్ తో విలనీ చేయించాలి అనేది ప్రశాంత్ నీల్ ప్లాన్. కేజీయఫ్ లో సంజయ్ దత్ ను విలన్ చేసాడు.
సలార్ లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ ను విలన్ చేసాడు. ఇప్పుడు తారక్ కోసం ఆమిర్ ను విలన్ చేస్తానంటున్నాడట. మరి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఈ ఆఫర్ ను అందుకుంటాడా లేక రిజెస్ట్ చేస్తాడా అనేది కొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.