త్వరలో విశాఖ నుంచి పాలనా వ్యవహారాలు ప్రారంభం అవుతాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఏ క్షణమైనా విశాఖ పరిపాలన రాజధానిగా కావొచ్చని ఇటీవల ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు అండ్ కో అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదని ఆరోపిస్తున్నారు ఆ ప్రాంతానికి చెందిన మంత్రులు. ఇటీవల ఉత్తరాంధ్రలో పర్యటించిన చంద్రబాబు అమరావతే రాజధానిగా ఉండాలని ప్రజలతో నినాదాలు చేయించారు. ఆయన తీరుపై వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా మండిపడ్డారు.
అమరావతినే రాజధాని చంద్రబాబు అంటున్నారని అలా అయితే మా విశాఖను మాకిచ్చేయాలని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రలో తిరుగుతూ అమరావతి రాజధాని అంటూ చంద్రబాబు పర్యటిస్తూ మన వేళ్లతో మన కళ్లనే ని పొడిచె ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబు అమరావతి రాజధాని అని చెబుతున్నాడు. మాకు అమరావతి వద్దు. మా విశాఖను మాకు ఇవ్వండి. వైగాజ్ రాజధానిగా ఒక చిన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటాం. మాకు తోచినట్లు మాకు చేతనైనట్లు ఎలాగోలా పాలించుకుంటాం అని ధర్మాన అన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తాడని విమర్శించారు. ప్రజలు ఇంకోసారి టీడీపీని నమ్మి మోసపోవొద్దని చంద్రబాబు ముసలివాడైన నడవలేకపోతున్నాడని విమర్శించారు. విశాఖ ప్రత్యే రాష్ట్రం అంటూ ధర్మాన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.