జనవరి 12 నుంచి సంక్రాంతి సీజన్ ప్రారంభం కావాల్సి ఉంది.
ఎందుకంటే జనవరి 12నే తమిళం నుంచి వారసుడు, తెగింపు, వీర సింహారెడ్డి సినిమాలు రిలీజ్ కు క్యూ కట్టాయి.
అయితే తమిళ సినిమాల విడుదల విషయంలో అక్కడి దర్శకనిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
అజిత్ నటిస్తున్న తునీవు మూవీని జనవరి 12న కాకుండా జనవరి 11న రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కొద్ది గంటల క్రితం రిలీజైన తునీవు ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.
ట్రైలర్ విడుదలైన తొలి 24 గంటల్లోనే 30 మిలియన్స్ కు పైగా వ్యూస్ అందుకుంది.
దక్షిణాదిలో ఈ స్థాయిలో వ్యూస్ తెచ్చుకున్న ట్రైలర్ మరొకటి లేదని దర్శకనిర్మాతలు చెప్పుకొస్తున్నారు.
ట్రైలర్ సూపర్ హిట్ కావడంతో యూనిట్ లో ఎక్కడ లేని జోష్ వచ్చేసింది.
అందుకే జనవరి 11న సినిమాను సోలోగా రిలీజ్ చేసి రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టవచ్చు అనేది తునీవు డిస్ట్రీబ్యూటర్స్ ప్లాన్. అయితే తునీవుకు సోలోగా థియేటర్స్ అప్పగించి విజయ్ తన వారుసుడు మూవీకి
స్క్రీన్స్ షేర్ చేసేందుకు ఒప్పుకుంటాడా అనేది ఇప్పుడు తమిళనాట ఆశక్తికర చర్చకు దారి తీసింది.