క్రాక్ కు వీరసింహారెడ్డి డబుల్ ఉంటుందని గోపీచంద్ మలినేని చెప్పిన విధంగానే ట్రైలర్ ఉంది.
సంక్రాంతికి పర్ఫెక్ట్ మాస్ మూవీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒంగోలులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య డైలాగ్స్, స్పీచ్ ప్రధాన ఆకర్షణగా మారాయి.
నేనెప్పుడు రాయలసీమ నేపథ్యంలో సినిమాలు చేస్తాను అనుకుంటారు. కాని అది తప్పు అని చెప్పాడు బాలయ్య.
చరిత్రలో శాస్వతంగా నిలిచిపోయే చిత్రం వీర సింహారెడ్డి అని బాలయ్య అంటే సినిమాలు రాజకీయాలు మాత్రమే కాదు,
అన్ స్టాపబుల్ లాంటి షోకూడా ఉంటాయని చెప్పుకొచ్చాడు నటసింహం. తన తండ్రి స్వర్గీయ విశ్వవిఖ్యాతనట సార్వభౌముడు ఎన్టీఆర్ చేయని పాత్ర లేదని తనని ఆదర్శంగా తీసుకునే సినిమాలు చేస్తున్నట్లు తెలిపాడు బాలయ్య.
ఇక వీర సింహా రెడ్డి ట్రైలర్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించింది. సీమలో ఏ ఒక్కడూ కత్తిపట్టకూడదని నేనొక్కడినే కత్తిపట్టా. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు ముందు తరాలునాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు సీమ మీద ఎఫెక్షన్ అంటూ గూస్ బంప్స్ తెప్పించే బాలయ్య మార్క్ డైలాగ్స్ తో షురూ అయింది ట్రైలర్. వీరసింహారెడ్డి పుట్టింది పులిచెర్ల చదివింది అనంతపురం. రూలింగ్ కర్నూల్ అంటూ రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో బాలయ్య చెప్పిన డైలాగ్ అన్నిటికంటే హైలైట్ అని చెప్పాలి. సంతకాలు పెడితే బోర్డ్ మీద పేరు మారుతుందేమో కాని చరిత్ర సృష్టించినా వాడి పేరు మారదు, మార్చలేదు అనే డైలాగ్ మాత్రం కాస్త కాంట్రవర్సీని క్రియేట్ చేసే విధంగా ఉంది. ఈ డైలాగ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఎటాక్ అని ప్రచారం సాగుతోంది. జనవరి 12న రిలీజ్ కానున్న వీర సింహారెడ్డిని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. గోపీచంద్ మలినేనిని సొంత అన్నకంటే ఎక్కువగా భావిస్తాను అని చెప్పింది శృతి హాసన్.