వారసుడు సినిమా విషయంలో దిల్ రాజు ఎంతైతే హంగామా చేసాడో ఇప్పుడు అంత సైలెంట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతా చేసి జనవరి 11న వారసుడు సినిమాను దిల్ రాజు విడుదల చేయడం లేదని
జనవరి 14 లేదా 15 విడుదల చేయబోతున్నాడని సమాచారం. జనవరి 11న వారసుడు సినిమాను రిలీజ్ చేయడం ద్వారా ఒకటి తెగింపు సినిమాతో స్క్రీన్స్ షేర్ చేసుకోవాల్సి రావడం అంతే కాకుండా జనవరి 12న బాలయ్య వీరసింహారెడ్డి గాను జనవరి 13న చిరు వాల్తేరు వీరయ్యగానూ వస్తుండటంతో వీటి మధ్య వారసుడు నలిగిపోతాడని
అందుకే రెండు, మూడు రోజులు ఆలస్యంగా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాడట దిల్ రాజు.
తమిళ వర్షన్ మాత్రం జనవరి 11న తమిళనాడులో ఉదయం 4 గంటల ప్రీమియల్ షోస్ నుంచే ప్రారంభం కానున్నాయి.
స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే ఏ హీరోని అయితే దిల్ రాజు తమిళనాడులో నెం1 కాదు అంటూ చెప్పుకొచ్చాడో,
ఇప్పుడు అదే హీరో నటించిన తెగింపు చిత్రాన్ని జనవరి 11న తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రిలీజ్ చేయబోతున్నాడు.