ఆ ఇద్దరూ టాలీవుడ్ లో టాప్ రేంజ్ హీరోలు . ఇద్దరి సినిమాలు ఒకే టైమ్ లో రిలీజైతే ఆబాక్సాఫీస్ వార్ ఊహలకే అందదు. ఈ సంక్రాంతి అదే జరగబోతుంది. ఇద్దరు వీరులు వెండితెరపై వీరంగం చేయబోతున్నారు .
మరివారిలో విన్నర్ ఎవరు. ఈ బిగ్ ఫైట్ లో బాక్సాఫీస్ కింగ్ గా ఎవరు అవతరిస్తారు. అసలు ఆ రసవత్తర సంగ్రామం ఎలా ఉండబోతుంది..? ఇద్దరు వీరులు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు . సంక్రాంతి వార్ కి సిద్ధమయ్యారు . సంక్రాంతి సినిమాలు కాబట్టి ఈరెండు సినిమాల ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓరేంజ్ లో జరిగింది. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ బిజినెస్ 88 కోట్లు. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ 73 కోట్లు . ఈవిషయంలో మెగాస్టారే కాస్త ముందున్నాడు . ఈ ఇద్దరు అగ్రహీరోల ప్రీవియస్ సినిమాల ప్రభావంకూడా ఈరెండు చిత్రాలపై ఉంటుందని సినీపండితులు అంచనా వేస్తు న్నారు. చిరు నటించిన ఆచార్య ఫ్లాప్ గా మిగిలింది. తర్వాత వచ్చిన గాడ్ ఫాదర్ కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం నిరాశపరిచాయి. బాలయ్య విషయానికి వస్తే అఖండ విజయంతో మాంచిఊపు మీదున్నాడు. మరోవైపు అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ సక్సెస్ వైబ్స్ కూడా బాలయ్యకు కలసి వచ్చే అంశాలే అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు .
ఈ ఇద్దరు హీరోలు ప్రమోషన్ విషయంలో తెగ్గేదేలే అంటూదూసుకెళుతున్నారు . దాంతో రెండు సినిమాలపై ఎక్స్పెక్టేషన్స్ ఓరేంజ్ లో పెరిగిపోతున్నాయి. రెండు సినిమాల ట్రైలర్లు, టీజర్లు, పాటలు సినీ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి.
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి. ఈ రెండు చిత్రాలనూ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తెరకెక్కించింది. సొంత డిస్ట్రిబ్యూస్ట్రిబ్యూ షన్ సంస్థను స్టార్ట్ చేసి ఈ రెండు సినిమాలనూ రిలీజ్ చేస్తున్నారు . రెండు సినిమాల్లోనూ హీరోయిన్ శ్రుతీహాసనే. ఇక ఇప్ప టికే ఈ భారీ చిత్రాల బుకింగ్ మేళా మొదలైంది. అమెరికా యూకేతో పాటు ఇతర ఓవర్సీస్ ప్రాంతాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీస్టార్ట్ అయ్యాయి. జనవరి 12న వీరసింహారెడ్డి వస్తున్నాడు. వీరసింహారెడ్డి గర్జనలతో థియేటర్లు దద్దరిల్లబోతున్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి ఈనెల 13న బాస్ బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాడు. వాల్తేరు వీరయ్యలో ఎక్స్ ట్రామాస్ ఎలిమెంట్ ఉంది. అదేమాస్ మహారాజ్ రవితేజ. మెగాస్టార్ కి తోడు ఓ ఇంపార్టెంట్ రోల్ లో మాస్ రాజా కనిపించబోతున్నాడు .
మొత్తానికి పొంగల్ పోటీకి రంగం సిద్ధమైంది. హైఎక్స్పెక్టేషన్స్ మధ్య చిరు బాలయ్య సినిమాలు రాబోతున్నాయి. మరి
ఈ ఇద్దరు అగ్రహీరోల్లో ఎవరు విజయపతాకం ఎగురవేస్తారు. ఒక్కరే విన్నర్ గా నిలుస్తారా. లేక ఇద్దరూ ఇరగదీస్తారా. ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ వసూళ్లలో ఎవరు ముందుంటారు. ఓవరాల్ రన్ లో బాక్సాఫీస్ కింగ్ ఎవరు. అతి త్వరలోనే ఈప్రశ్నలన్నింటికీ జవాబులు దొరకబోతున్నాయి. బాలయ్య చిరంజీవి సినిమాల మధ్యపోటీ అంటే అది ఆ ఇద్దరు నటుల మధ్య పోటీయే కాదువారి అభిమానుల మధ్య కురుక్షేత్ర సంగ్రామమే. ఎవరి సినిమా బ్లాక్ బస్టర్ అయినా రెండోవారి అభిమానులు తట్టుకోలేరు. ఒకరి సినిమా ఫట్ అంటే చాలు ప్రత్య ర్ధి నటుడి అభిమానులకు అదిపెద్ద పండగే.
ఇద్దరూ మా స్ హీరోలే. ఇద్దరి పేర్లు చెబితే వచ్చే వి పూ నకా లే. వీరి సినిమా లపై అం చనా లు కూ డా వీర లెవెల్లో నే
ఉంటాయి. అయితే ఆ అంచనాలకు దగ్గరగా సినిమాలు ఉంటాయా లేక తల్లకిందులు అవుతాయా అన్నది పండగ రోజున
తేలిపోతుంది. ఒక్కటి మాత్రం నిజం ఈరెండు సినిమాలతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు నిజమైన సంక్రాంతి మూడురోజుల ముందుగానే వచ్చేస్తుంది.
చిరం జీవి-బా లయ్యల మధ్య సినిమాలపోరు ఈనాటిది కాదు. దశాబ్దాలుగా అది కొనసాగుతూనే ఉంది.
ప్రత్యేకించి సంక్రాంతి పండగ సందర్భం గా ఇద్దరి సినిమాలూ పోటీపడ్డం కూడా ఇప్పుడే మొదలు కావడం లేదు.
మూడున్నర దశాబ్ధాలుగా ఇద్దరి సినిమాలు కొదమసింహాల్లా తలపడుతూనే ఉన్నాయి. ఈ ప్రస్థానం లో ఇద్దరికీ బ్లాక్
బస్టర్లున్నాయి. ఇద్దరికీ కొన్ని డిజాస్టర్లూ ఉన్నాయి. అయితే ఆరోగ్యకరమైన పోటీ మాత్రం సాగుతూనే ఉంది. యుద్ధం
సినిమాల మధ్యనే తప్ప నటుల మధ్యకాదు. అయితే 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతి పండగ సమయం లో
హోరా హోరీ తలపడే రెండు సినిమాలను ఒకే నిర్మాణ సంస్థ నిర్మించడం మాత్రం ఇదే మొదటి సారి. వాల్తేరు వీరయ్య వీర సింహారెడ్డి సినిమాలు రెండింటినీ కూడా మైత్రీ మూవీమేకర్స్ సంస్థే నిర్మించడం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండక్కి పెద్ద ప్రాధాన్యతే ఉంది. రైతుల పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి రైతుల దగ్గర నాలుగు డబ్బులు ఆడతాయి కాబట్టి సకలవ్యాపారాలూ కళకళలాడుతూ ఉంటాయి. అందులో సినిమా వ్యాపారానికి ఇది అసలు సిసలు సీజన్ అనే చెప్పాలి. అందుకే అగ్రనటులు తమ ప్రతిష్ఠాత్మక సినిమాలను సంక్రాంతి సందర్భంగానే విడుదల చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. నందమూరి బాలయ్య, చిరంజీవి ఇద్దరూ కూడా ఊరమాస్ హీరోలు. ఈ ఇద్దరి సినిమాలు విడుదలైతే మాస్ జనాల్లో పూనకాలు వచ్చేస్తాయి. థియేటర్లు కళకళలాడిపోతాయి. అందులోనూ సంక్రాంతి సీజన్లో ఈ ఇద్దరి సినిమాలూ విడదలైతే మాత్రం అటు అభిమానులకూ ఇటు ఫ్యాన్స్ కూ సంక్రాంతిని మించిన పెద్దపండగే అవుతుంది. 1987 సంక్రాంతిలో బాలయ్య-చిరంజీవిల సినిమాలు మొదటి సారి తలపడ్డాయి. జనవరి 9న చిరంజీవి- కోదండ రామిరెడ్డి కాంబినేషన్లో రూపొందిన దొంగమొగుడు విడుదలైంది. మొదటిరోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అయిదు రోజుల తర్వాత జనవరి 14న బాలయ్య కోదండ రామిరెడ్డిల కాంబినేషన్ లో రూపొందిన భార్గవ రాముడు సినిమా విడుదలైంది.
ఈ సినిమా కూ డా హిట్ టా క్ తెచ్చుకున్నా దొంగరాముడు సినిమాకి కొంచెం ఎక్కువ ఎడ్జ్ ఉందని సినీరంగ విశ్లేషకులు
వ్యాఖ్యానించారు . ఆ మరుసటి ఏడాది అంటే 1988లో జనవరి 14న చిరంజీవి కె.రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందిన మంచిదొంగ విడుదలైంది. ఆ మర్నా డే జనవరి 15న బాలయ్య ముత్యాల సుబ్బయ్యల సినిమా ఇన్ స్పెక్టర్ ప్రతాప్ విడుదల అయ్యింది. వీటిలో మంచి దొంగ ఏవరేజ్ హిట్ కాగా ఇన్ స్పెక్టర్ ప్రతాప్ హిట్ టాక్ తెచ్చుకుంది. 1989 సంక్రాంతి బరిలో జనవరి 14న చిరంజీవి నటించిన అత్తకుయముడు అమ్మాయికి మొగుడు సినిమా విడుదలైంది. రిలీజ్ రోజునే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. మరుసటి రోజున జనవరి 15న బాలయ్య నటించిన భలేదొంగ సినిమా విడుదలైంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. కలెక్షన్ల వర్షం కురిసింది. ఆ తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఇద్దరి సినిమాలూ సంక్రాంతి సీజన్లో విడుదలయ్యాయి. ముందుగా 1997 జనవరి 4న హిట్లర్ సినిమా రిలీజ్ అయ్యింది. బ్లాక్ బస్టర్ కాకపోయినా హిట్ సినిమాగా పేరుతెచ్చుకుంది.
ఆరు రోజుల తర్వాత 1997 జనవరి 10న బాలయ్య సినిమా పెద్దన్నయ్య విడులైంది. ఈ సినిమా కూడా హిట్ టాక్ తో
దూసుకుపోయింది. మరో రెం డేళ్ల తర్వా త 1999లో జనవరి 13న బాలయ్య నటించిన సమరసింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ గా మెరిసింది. దీనికి ఇంచుమించు రెండు వారాలకు ముందే జనవరి 1న చిరంజీవి నటించిన స్నేహంకోసం రిలీజ్ అయ్యి ఏవరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. రెండు వేల సంవత్సరం లో జనవరి 7న చిరంజీవి సినిమా అన్నయ్య విడుదలైంది. జస్ట్ ఓకే టాక్ తెచ్చుకుంది. వారం తర్వాత జనవరి 14న బాలయ్య నటించిన వంశోద్ధారకుడు రిలీజ్ అయ్యింది. ఇది ఫ్లాప్ అయ్యింది. 2001 జనవరి 11న బాలయ్య సినిమా నరంసింహనాయుడు విడుదలై భారీహిట్ టాక్ తెచ్చుకుంది. ఇదే రోజున చిరంజీవి నటించిన మృగరాజు విడుదలైం చిరంజీవి కెరీర్లోనే డిజాస్టర్ గా నిలిచింది.
మళ్లీ మూడేళ్ల తర్వాత 2004 లో బాలయ్య , చిరంజీవి సంక్రాంతి బరిలో పోటీపడ్డారు. 2004 జనవరి 14న బాలయ్య నటించిన లక్ష్మీనరసింహ విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఆ మర్నాడు జనవరి 15న చిరంజీవి నటించిన అంజి సినిమా విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 2004 తర్వాత మళ్లీ ఇద్దరూ 2017 సంక్రాంతిలో తలపడ్డారు . 2008 లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లో కి రావడంతో ఇంచుమించు తొమ్మిదేళ్ల పాటు సినిమాలకు దూరంయ్యారు .
2017లో చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ను సంక్రాంతి సీజన్ లోనే ప్రారంభించారు . 2017 జనవరి 11న చిరంజీవి వినాయక్ ల కాంబినేషన్ లో చిరంజీవి 150వ సినిమాగా విడుదలైన ఖైదీ నంబర్ 150 సూ పర్ హిట్ అయ్యింది. 2017 జనవరి 12న బాలయ్య నటించిన చారిత్రక సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలై పెద్దహిట్ కొట్టింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ సంక్రాంతి సీజన్ లో కలబడలేదు. ఆరేళ్ల తర్వాత ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య గా చిరంజీవి వెండితెరను అలరించనున్నారు. ఇక బాలయ్య మాంచి మాస్ క్యారెక్టర్ తో వీరసింహారెడ్డిగా కనపడనున్నారు. ఈ రెండు సినిమాలపైనే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పోరులో ఎవరు పెద్ద వీరుడిగా అవతరిస్తారు అన్నది తేలాల్సి ఉంది.