మెగాస్టార్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక చెక్కుచెదరని బ్రాండ్. నటమీద ఆసక్తితో చెన్నైకి వెళ్లి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రెయినింగ్ తీసుకుని పునాది రాళ్లు సినిమాతో తన కెరీర్‌కు పునాది వేసుకున్నారు. ఎదిగి ఇంతింతై వటుడింతై అన్నట్లు తన నటన డ్యాన్స్ ఫైట్లతో కుర్రకారును ఉర్రూతలూగించారు. చిరంజీవి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు. సినిమా అవకాశాల కోసం మొదట్లో మద్రాసులో స్థిరపడ్డారు. ఆ తరువాత హైదరాబాద్‌కు షిఫ్టయ్యారు. అయితే ఇప్పుడు ఆయన విశాఖలో సెటిల్ అవుదామనుకుంటున్నారట. ఆ విషయం ఆయనే వెల్లడించారు. ఆదివారం విశాఖపట్నంలో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ తాను ఇక్కడే స్థిరపడతానని విశాఖ పౌరుడ్నవుతానని చెప్పారు. భీమిలి రోడ్లో స్థలం కొనుక్కున్నానని త్వరలోనే ఇల్లు కట్టుకుంటానని తెలిపారు. అయితే చిరంజీవి నిజంగానే విశాఖకు మారిపోతారా లేకపోతే కేవలం సినిమా సినిమా ప్రమోషన్ కోసమే అలా మాట్లాడారా అని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖలో స్థిరపడాలని నిర్ణయించుకున్న మెగాస్టార్ చిరంజీవికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానని అన్నారు వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి. చిరంజీవి కొత్త చిత్రం వాల్తేరు వీరయ్య ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. చిరంజీవి ప్రసంగం తాలూకు పత్రికా కథనాన్ని కూడా తన ట్వీట్ కు జతచేశారు.