రామ్‌గోపాల్ వర్మ రూటే వేరు. ఎవరు ఏమనుకున్నా తన మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయటపెడతారు. అందుకే ఆయన ఏం మాట్లాడినా వివాదాస్పదం అవుతుంది. కందుకూరులో టీడీపీ సభలో తొక్కిసలాట జరిగి ఎనిమిది చనిపోవడానికి చంద్రబాబే కారణమని ట్వీట్ చేశారు. తనకు ఎంత పాపులరాటీ ఉందో అని ప్రూవ్ చేసుకోడానికి జనాల చావులను వాడుకోవడం అన్నది దారుణం అన్నారు. ఆ దుర్ఘటనలతో మీకు సంబంధం లేదంటే ఎవరూ నమ్మరు అని ట్వీట్‌లో దుయ్యబట్టారు.
ఇక ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ మీద పడ్డారు. చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ పై ఆయన చేసిన ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపింది. డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు. రెస్ట్ ఇన్ పీస్ కాపులు కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గం నేతలు కూడా ఆర్జీవీ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు. అయినా ఆర్జీవీ వెనక్కి తగ్గలేదు. పవన్ కళ్యాణ్‌పై వరుస ట్వీట్లతో దాడి చేస్తూనే ఉన్నారు.
తాజాగా కాపులు మైనస్ కాపులు ఇంటు కాపులు ప్లస్ కమ్మోళ్ళు డివైడెడ్ బై సేనలు మైనస్ సేనలు ఇస్ నాట్ ఈక్వల్ టు ఓట్లు అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ ఆర్జీవీ మీద ఫైర్ అయ్యారు. ఆయన కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు.
అయినా ఆర్జీవీ ఊరుకోలేదు. వెంటనే మరో ట్వీట్ వదిలారు. కె.ఎ పాల్ బల్ల గుద్ది తనే తరువాతి సీఎం అంటున్నాడు. సిబి ది కూడా అదే మాట అననిది పి ఒక్కడే. అంటే కమ్మ దొరలకి తల వంచేసినట్లేనా ? యాజ్ ఏ పి ఫ్యాన్, ఐ హర్టెడ్ అని ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ.
ఇందులో సిబి అంటే చంద్రబాబు, పి అంటే పవన్ కళ్యాణ్. కె.ఎ పాల్ కూడా సీఎం అవుతానంటున్నాడు కానీ తాను సీఎం అవుతానని పవన్ కళ్యాణ్ అనడం లేదు. చంద్రబాబును ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆర్జీవీ సెటైర్ అన్నమాట. ఆర్జీవీ వదులుతున్న వరుస ట్వీట్లతో జనసైనికులు, కాపు సామాజిక నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.