త్రిబుల్ ఆర్ మూవీ లో నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ గెలుచుకోవడంతో
చిత్ర యూనిట్ గాల్లో తేలుతోంది. అదే స్పీడ్ లో వెస్ట్రన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో
తమ ఫేవరేట్ మూవీస్ వెల్లడించారు. రామ్ చరణ్ సింపుల్ గా క్యాప్టెన్ అమెరికాకు జై కొట్టాడు.
తారక్ మాత్రం ఐరెన్ మ్యాన్ అంటే ఇష్టం అన్నాడు. అంతే కాదు వీరిద్దరు మార్వెల్ మూవీస్ లో నటించేందుకు సైతం ఆసక్తి చూపించారు. RRRతో రామ్ చరణ్ తారక్ హాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ అందుకున్నారు. భవిష్యత్ అన్ని కుదిరితే వీరిద్దరు మార్వెల్ మూవీస్ లో మెరిసినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ వచ్చింది. అదే స్పీడ్ లో
మార్చి 12న ఆస్కార్ వేదికపై ఈ సినిమా ఆస్కార్ అందుకుంటే మాత్రం హాలీవుడ్ లో RRR హీరోలకు దర్శకుడు రాజమౌళికి సంగీత దర్శకుడు కీరవాణికి లైన్ క్లియర్ అవుతుంది. ఆ తర్వాత వీరు హాలీవుడ్ లో బిజీ అయినా ఆశ్చర్యం లేదు.