తమిళనాడు సంక్రాంతి సంబరం అంబరాన్ని అంటింది.
ఎందుకంటే అజిత్ నటించిన తునీవు, విజయ్ నటించిన వారీసు రెండూ
కూడా అక్కడ పాజిటివ్ టాక్ అందుకున్నాయి. ఇంకాస్త క్లియర్ గా చెప్పాలంటే
రెండూ కూడా యవరేజ్ మూవీగా క్రిటిక్స్ నుంచి రేటింగ్స్ తెచ్చుకున్నాయి.
అజిత్ తునీవు పూర్తిస్థాయి యాక్షన్ మూవీగా అలరిస్తుంటే
వారీసు కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులను మెప్పిస్తోంది.
తొలి రోజు ఈ రెండు సినిమాల వసూళ్లు కలుపుకుని
ఒక్క తమిళనాడుకు సంబంధించే 30 కోట్ల వసూళ్లు దాటే అవకాశాలు ఉన్నాయి.
జనవరి 17 వరకు అక్కడి థియేటర్స్ పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ జరిగిపోవడం
రెండు చిత్రాలు పాజిటివ్ టాక్ తో ఉండటంతో తమిళనాట వసూళ్ల వరద పారనుంది.
ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ రెండు చిత్రాలు నువ్వా నేనా అనే విధంగా పోటీ పడుతున్నాయి.