గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ వీర సింహారెడ్డి సంక్రాంతి బరిలోకి దిగింది.
జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా తొలి ఆట నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకోవడం మొదలైంది.
మధ్యాహ్నం కు సినిమా యావరేజ్ అని తేల్చేశారు ఫిల్మ్ క్రిటిక్స్. అయితే పండగ సమయం కావడం
బీసీ ఆడియెన్స్ ఈ సినిమాకు పెద్ద ఎత్తున కనెక్ట్ కావడంతో ఫస్ట్ డే అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
సీడెడ్ లో అయితే ఎక్స్ ట్రా చైర్స్ వేసి మరి సినిమాలు ప్రదర్శిస్తున్నారట. ఈ సంగతి ఇలా ఉంటే బాలయ్య కెరీర్ లోనే ఈ సినిమా అత్యఅధిక ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 50 కోట్లకు పైగా వసూళ్లను అందుకుని
పెట్టిన పెట్టుబడిని చాలా వరకు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలయ్య చాలావీక్ అని చెప్పిన నైజాం, ఓవర్సీస్ మార్కెట్స్ లో సైతం ఈ చిత్రం భారీ వసూళ్లను కొల్లగొడుతుండటం నందమూరి అభిమానులకు మూడు రోజుల ముందుగానే సంక్రాంతి పండగ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన వీర సింహా రెడ్డి
పండగ దాటేవరకు లాభాల్లో పడే అవకాశాలే ఎక్కువ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.