సంక్రాంతి సినిమాల్లో ఇఫ్పుడు చిరు నటించిన వాల్తేరు వీరయ్యకే అత్యఅధిక వసూళ్లు అందుతున్నాయి.
చిరు చేసిన కామెడీ, రవితేజ చేసిన యాక్షన్ ఈ సినిమాను ఇప్పటికే 100 కోట్ల వసూళ్లను దాటించింది.
అదే స్పీడ్ లో ఓవర్సీస్ లో 2 మిలియన్ వైపు పరుగులు తీస్తోంది. ఈ దశలో వాల్తేరు వీరయ్య ఇచ్చిన జోష్ లో చిరు తన తదుపరి చిత్రం భోళ శంకర్ షూటింగ్ ను త్వరలోనే తిరిగి ప్రారంభించబోతున్నారు. అందుకోసం షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేయాల్సిందిగా దర్శకుడు మెహర్ రమేష్ ను ఆదేశించారట. కోలీవుడ్ సూపర్ హిట్ వేదాళం తెలుగు రీమేక్ మూవీగా భోళాశంకర్ తెరకెక్కుతోంది. వచ్చే మార్చిలోనే మూవీని రిలీజ్ చేయాల్సి ఉండటంతో సంక్రాంతి పండగ సెలవులు, ప్రమోషన్స్ పూర్తైన తర్వాత చిరు ఈ చిత్రం పై ఫోకస్ పెట్టబోతున్నాడు. ఈ చిత్రంలో చిరుకు చెల్లెలిగా కీర్తిసురేష్ నటిస్తోంది. హీరోయిన్ గా తమన్నా కనిపించబోతోంది. మార్చిలో భోళాశంకర్ ను కూడా రిలీజ్ చేసి ఆ తర్వాత ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టబోతున్నాడు చిరు. మెగా ఫ్యాన్స్ తన నుంచి కోరుకుంటున్న బ్లాక్ బస్టర్ అందించేందుకు చిరు ఈసారి తన ఫేవరేట్ డైరెక్టర్ వినాయక్ తో చేతులు కలపడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం చిరుతో చేయాల్సిన సినిమా కోసమే వినాయక్ కథను సిద్ధం చేస్తున్నాడు.