మెగా హీరోలు బాధలు కష్టాలు మరే హీరోకు రాకూడదు. వారు ఎంతో అభిమానించే హీరోలు స్ట్రెయిట్ మూవీస్ తో రావాలని అప్పుడే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతాయని అభిమానుల నమ్మకం. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ ఇప్పటికే వాల్తేరు వీరయ్య 150 కోట్లకు పైగా కొల్లగొట్టింది. అందుకే వారు చిరు, పవన్ ను రీమేక్స్ కు దూరంగా ఉండమంటున్నారు.
కాని చిరు, పవన్ పోటీ పడి రీమేక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే చిరు భోళాశంకర్ రీమేక్ లో నటిస్తున్నాడు.
ఈ మధ్యే ఈ సినిమా సెట్ లోకి అడుగు పెట్టాడు. ఈ దశలో అజిత్ నటించిన విశ్వాసం మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నాడని ఈ రోజు అంతా గోల గోల జరిగింది. రీమేక్ బాధ్యతలను వినాయక్ కు అప్పగించినట్లు ప్రచారం సాగింది. ఈ దశలో చిరుకు అలాంటి ఆలోచన లేదని మెగా కాంపౌండ్ నుంచి కన్ ఫర్ మేషన్ అయితే వచ్చింది. మరో వైపు పవన్ కూడా సాయి ధరమ్ తేజ్ తో కలసి తమిళ సినిమా వినోదయ సిత్తం లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తర్వాత పపన్ నటిస్తున్న మరో రీమేక్ మూవీ ఇది.
ఈ సినిమా కాకుండా తేరీ తెలుగు రీమేక్ లో కూడా పవన్ నటిస్తున్నాడు. ఈ రీమేక్ ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో రీమేక్ కానుంది.