ఫస్ట్ ప్రయోగాలు ఆ తర్వాత మాస్ దారి.. ఇఫ్పుడు యాక్షన్ రూట్

By KTV Telugu On 21 January, 2023
image

గద్దలకొండ గణేష్ కాస్త ఇప్పుడు గాంఢీవధారి అర్జునుడిగా మారాడు.
లాస్ట్ ఇయర్ నాగార్జున హీరోగా ది ఘోస్ట్ తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు
హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్ ను తలపిస్తూ గాంఢీవధారి అర్జున అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పటికే 50 శాతం షూటింగ్ సైతం పూర్తి చేసుకున్న ఈ మూవీపై వరుణ్ తేజ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు.
ఎందుకంటే ఎఫ్ 3, గని రెండూ కూడా తనకి పెద్దగా హెల్ప్ కాలేదు.
ఈ దశలో కొత్త సినిమా తనకు యాక్షన్ హీరో ఇమేజ్ అందివ్వాలని బలంగా కోరుకుంటున్నాడు.
పక్కా టైట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కవ భాగం లండన్ లో జరపుకుంది.
త్వరలో యూనిట్ ఢిల్లీలో ఒకటి ఉత్తరాఖండ్ లో మరొకటి ప్రారంభించనుంది.
మార్చిలో సినిమా షూటింగ్ ను పూర్తి చేసి వేసవికి బాక్సాఫీస్ బరిలోకి దిగాలి అనేది మెగా ప్రిన్స్ ప్లాన్.
కెరీర్ బిగినింగ్ లో చాలా ప్రయోగాలు చేసాడు వరుణ్ తేజ్. ఆ తర్వాత కాస్త కమర్షియల్ దారి పట్టి ఫిదా, లవ్ స్టోరీ , గద్దలకొండ గణేష్, ఎఫ్ 3 లాంటి చిత్రాలు చేసాడు. ఇప్పుడు కొత్త చిత్రంతో యాక్షన్ హీరోగా మారిపోవాలి అనుకుంటున్నాడు.