హాలీవుడ్ కు రాజమౌళి వెళ్లిపోతే టాలీవుడ్ పరిస్థితి ఏంటి ఆ సీక్వెల్స్ ఎవరు తీస్తారు

By KTV Telugu On 22 January, 2023
image

హాలీవుడ్ చూపు రాజమౌళి పై పడింది. అతని విజన్ ఏంటో, అతని మేకింగ్ టాలెంట్ ఏంటో హాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌసెస్ కు బాగా అర్ధమైంది. దాంతో జక్కన్నకు హాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచింది. కామెరూన్ అంతటి వాడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ చూడటం మాత్రమే కాదు హాలీవుడ్ రావాలనుకుంటే వచ్చేయ్ ,మనము సినిమా చేద్దాం అన్నాడు అంటే ఇక రాజమౌళికి తిరుగులేదనే అర్ధం. ఈ దశలో దర్శకధీరుడు కనుక హాలీవుడ్ కు వెళ్లిపోతే అతను తీస్తాను అని చెప్పిన బాహుబలి -3 పరిస్థితి ఏంటి అలాగే త్రిబుల్ ఆర్ సీక్వెల్ ఎప్పుడు తెరకెక్కిస్తాడు.
ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తో పాటు రాజమౌళి కోసం ఇప్పటికే విక్రమార్కుడు-2, ఈగ 2 సీక్వెల్ స్టోరీ రాసి పెట్టుకున్నాడు విజయేంద్రప్రసాద్. ఈ సినిమాల పరిస్థితి ఏంటి అనేది ఇఫ్పుడు గందరగోళంగా మారింది.
మహేష్ తో మూవీ తర్వాత రాజమౌళి కంప్లీట్ గా హాలీవుడ్ కు షిప్ట్ అయినా ఆశ్చర్యం లేదు.
ఈ దశలో అతని నుంచి పెండింగ్ పడిపోయిన సీక్వెల్ పరిస్థితి ఏంటి అనేది అప్పుడే జక్కన్న దిగులు పెట్టుకున్నారు.
మార్చి 12న తో ఆస్కార్ కార్యక్రమం ముగుస్తుంది. ఆ తర్వాత మహేష్ తో చేయాల్సిన మూవీ పై రాజమౌళి ఫోకస్ పెట్టనున్నాడు. జూన్ లేదా జులైలో షూటింగ్ ప్రారంభిస్తాను అని చెప్పాడు జక్కన్న. మహేష్ తో రాజమౌళి ఫిల్మ్ కంప్లీట్ అయ్యేందుకు మరో రెండు మూడు ఏళ్లు ఈజీగా పడుతుంది. ఆ తర్వాత ఏం చేస్తాడు అనేది ఆసక్తిని కలగిస్తోంది.