ముందు టైటానిక్, తర్వాత అవతార్, ఇప్పుడు అవతార్ -2 మొత్తంగా జేమ్స్ కామెరూన్ ఎప్పుడు సినిమా తీసుకొచ్చినా
బ్లాక్ బస్టర్ పోస్టర్ కనిపిస్తోంది. అదే విధంగా కలెక్షన్స్ 2 బిలియన్ క్లబ్ దాటి వెళ్తున్నాయి. ఇప్పుడు అవతార్ -2తో అదే జరిగింది. డిసెంబర్ మూడవ వారంలో విడుదలైన అవతార్ -2 వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ కలెక్షన్స్ రాబట్టింది.
ఇప్పుడు అదే స్పీడ్ లో 2 బిలియన్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ భూ ప్రపంచం మీద ఇలాంటి రికార్డ్ నెలకొల్పిన ఏకైక దర్శకుడు జేమ్స్ కామెరూన్ మాత్రమే. 2 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 16 వేల కోట్లు.
మొత్తంగా అవతార్ -2 బ్లాక్ బస్టర్ కావడంతో ఇఫ్పుడు అవతార్ సిరీస్ లో మూడు, నాలుగు, ఐదు కూడా తీసుకొస్తాను అంటున్నాడు కామెరూన్. ఇక ఇండియాలోనూ ఇప్పటికే ఈ సినిమా హైయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
సరాసరి 368కోట్లు దాటి అప్పటి వరకు నెంబర్ వన్ పొజీషన్ లో కొనసాగుతున్నఅవెంజర్స్ ఎండ్ గేమ్ రికార్డులను బద్దలు కొట్టింది.