కోర్టు హాలులో మొట్టమొదటిసారిగా రోబో వాదనలు

By KTV Telugu On 26 January, 2023
image

రోజురోజుకూ సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ తో ఊహకందని అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు శాస్త్రవేత్తలు. మరోవైపు రోబో టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మానవ జీవితంలో మరమనుషులు ముఖ్యపాత్ర వహించబోతున్నాయి. ఇప్పటికే వివేశాల్లో వివిధ రంగాల్లో రోబోలు సేవలందిస్తున్నాయి. ఇక ఇప్పుడు కోర్టు హాల్లో జడ్జి ఎదురుగా నిలబడి యువరానర్ అని ఒక రోబో లాయర్ నల్ల కోటు ధరించి కేసు వాదించడానికి రెడీగా ఉంది. ఒక రోబో లాయర్ కోర్టులో కేసును వాదించడం ఇదే మొదటి సారి. డునాట్ పే అనే స్టార్టప్ కంపెనీ ఈ రోబో న్యాయవాదిని తయారుచేసింది.

ప్రపంచంలో మొట్టమొదటి రోబో న్యాయవాది ఇదే కావడం విశేషం. డూనాట్‌పే అనే స్టార్టప్ కంపెనీ ఈ రోబో న్యాయవాదిని సృష్టించింది. జోషువా బ్రౌడర్ 2015లో డూనాట్‌పే అనే లీగల్ సర్వీసెస్ చాట్‌బాట్‌ను స్థాపించారు. రుసుముల చెల్లింపు ఆలస్యమవడం జరిమానాల విధింపు వంటి కేసుల్లో ఈ రోబో లాయర్ న్యాయ సలహాలు ఇస్తుంది. కేసు గురించి దీనికి శిక్షణ ఇవ్వడానికి చాలా సమయం పట్టిందని స్టార్టప్‌ నిర్వహకులు తె తెలిపారు. వచ్చే నెలలో అమెరికాలోని ఒక కోర్టులో ట్రాఫిక్ చలానాకు సంబంధించిన కేసును ఈ రోబో వాదించబోతోంది. అయితే ఈ కేసు విచారణ ఏ కోర్టులో జరుగబోతోందో ఆ కంపెనీ వెల్లడించలేదు. పరిమితికి మించి వేగంగా వాహనాన్ని నడిపినందుకు విధించిన చలానా కేసులో ఈ రోబో న్యాయవాది తన వాదనలను వినిపించనుంది.