భీమ్లానాయక్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల సంఖ్య చాలా ఉంది.
అందులో ఏది ముందుగా రిలీజ్ అవుతుంది అంటే హరి హర వీర మల్లు అని చెప్పువచ్చు.
ఈ విషయాన్ని వీరమల్లు నిర్మాత ఏ.ఎం. రత్నం స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.
సినిమా షూటింగ్ ఇంకా 40 శాతం పెండింగ్ ఉందని జూన్ లేదా జులైతో మూవీ షూటింగ్ పూర్తి చేసి
వచ్చే దసరా పండక్కి వీరమల్లును పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అంటున్నాడు ఏ.ఎం.రత్నం.
ఇక హరీష్ శంకర్ మేకింగ్ లో తేరీ తెలుగు రీమేక్ లో పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఈ రెండు సినిమాల మధ్య మరో రెండు చిత్రాలు ఉన్నాయి.
ఒకటి వినోదయ సిత్తం తెలుగు రీమేక్. ఈ మూవీ గురించి అయితే అప్ డేట్ లేదు. మరొమూవీ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్
ఈ సినిమాను సాహో ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్య నిర్మిస్తున్నాడు.
జనవరి 30న ఘనంగా షూటింగ్ ప్రారంభం కానుంది. మరో విశేషం ఏంటంటే ఓజీ విషయంలో సుజిత్ విక్రమ్ మూవీ ఫార్ములా ను అప్లై చేస్తున్నాడట. అంటే సినిమా మొత్తం పవన ఉండడు. కేవలం 50 శాతం మాత్రమే ఉంటాడు.
అందుకే సాంగ్స్ కు స్కోప్ లేకుండా ప్లాన్ చేస్తున్నాడట. ఈ మూవీకి కోలీవుడ్ సెన్సేషన్ అనిరుథ్ స్వరాలు సమకూర్చే అవకాశాలు ఉన్నాయి. ఓజీ ఎప్పుడు రిలీజ్ అనేది తెలియాల్సి ఉంది.