లాస్ట్ ఇయర్ జూన్ లో తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లాడింది నయనతార.
ఆ పెళ్లికి ఎవరొచ్చారు. నయన్, విఘ్నేశ్ మ్యారేజ్ ఎలా జరిగింది అనేది
చూడాలని తెల్సుకోవాలని చాలా అంటే చాలా ఆశక్తి చూపించారు నయన్ ఫ్యాన్స్.
కాని పెళ్లి వీడియోను నెట్ ఫ్లిక్స్ కు ఇచ్చేసింది లేడీ సూపర్ స్టార్.
అందుకోసం భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంది.
అయితే నెట్ ఫ్లిక్స్ ఇంత వరకు ఈ పెళ్లి వీడియోను ఎందుకు రిలీజ్ చేయలేదో తెలుసా.
నయనతార భర్త విఘ్నేశ్ శివన్. అతను అతని టీమ్ ఇంకా పెళ్లి వీడియోను ఎడిట్ చేస్తూనే ఉన్నారట
నిజం చేప్పాలంటే ఇంకా షూటింగ్ ను కొనసాగిస్తూనే ఉన్నారు. త్వరలో ఎడిట్ వర్క్ పూర్తైన తర్వాత
నయనతార పెళ్లి వీడియోకు సంబంధించిన స్ట్రీమింగ్ డేట్ ను నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేయనుంది.
బహుశా మార్చి లేదా ఏప్రిల్లో పెళ్లి వీడియో బయటికి రానుంది. మరో వైపు నయన్ తర్వాత హన్సిక పెళ్లి జరిగింది.
ఆమె వీడియో కూడా త్వరలో హాట్ స్టార్ లోకి రానుంది. ఈ సంగతి ఇలా ఉంటే నయనతార భర్తకు బిగ్ షాక్ తగిలింది.
అజిత్ తో ఈ విఘ్నేశ్ సెట్ చేసుకున్న మూవీకి ఇప్పుడు బ్రేక్ పడిందని కోలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే విఘ్నేష్ కు కష్టాలు ఇంకా పెరిగినట్లే.