పర్సనల్ లా బాల్య వివాహం నేరం కాదు కానీ స్టాట్యూటరీ లా ప్రకారం నేరం. ఇప్పుడు పర్సనల్ లా వర్కవుట్ అవదు. ఇప్పుడున్న చట్టాల ప్రకారం పద్దెనిమిదేళ్ల లోపు అమ్మాయిలకు జరిగే పెళ్లిని బాల్య వివాహాలుగానే పరిగణిస్తారు.
అలాంటి వారు ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొన్నా అది రేప్ కేసు కిందే పరిగణిస్తారు. కానీ దేశంలో బాల్య వివాహాలు తగ్గి ఉండవచ్చు కానీ పూర్తిగా ఆగలేదు.
దేశంలో చాలా ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికీ బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అందుకే సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై దాఖలైన పిటిషన్ విషయంలో స్పందించి ఫార్మల్ నోటీసులు జారీ చేసింది. 15ఏళ్లకు పెళ్లి వయసు గురించి ఈ నోటీసులు వెళ్లాయి.
కానీ అసలు పద్దెనిది ఏళ్లకే అమ్మాయిలకు పెళ్లి చేయడం వల్ల సమస్యలు వస్తున్నాయని కేంద్రం ఇటీవ పెళ్లి వయసును 21కి పెంచాలనుకుంది. చట్టంచేయాలనుకుంది. కానీ ఈ చట్టం ఇంకా ఆమోదం పొందలేదు. కాబట్టి ఇప్పటికైతే అమ్మాయిల పెళ్లి వయసు 18.
బాల్య వివాహాలకు ఆపలేకపోతున్నారు కానీ ఇలా పద్దెనిమిదేళ్ల కంటే ముందే వివాహాలు చేయడం వల్ల అనేక ఆరోగ్యపర సమస్యలు వస్తాయని చాలా కాలంగా అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఓ వైపు సుప్రీంకోర్టు పదిహేనేళ్ల పెళ్లి వయసుపై నోటీసులు మరో వైపు కేంద్రం 21 ఏళ్ల పెళ్లి వయసుపై చట్టం చేయానుకుంటున్న వైనంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశం అవడం ఖాయం.