పవన్ సినిమాలపై రూమర్లే రూమర్లు వస్తున్నాయి. చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నాడు పవర్ స్టార్.
వీటిల్లో ముందుగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో పవన్ నటిస్తున్నాడు.
ఆ తర్వాతే వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు పట్టాలెక్కనున్నాయి.
అయితే వీటిల్లో రెండు చిత్రాలను రెండు భాగాలుగా విడుదల చేయాలనుకుంటున్నారు.
వీరమల్లు సినిమాకు సంబంధించిన 60 శాతం షూటింగ్ పూర్తైనప్పటికీ
సరైన క్రేజ్ లేదు. ఈ దశలో సినిమా బడ్దెట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.
అందుకే హరి హర వీరమల్లు మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేసి
నిర్మాతకు కొంతలో కొంత భారం తగ్గించాలనుకుంటున్నాడట పవర్ స్టార్.
సుజిత్ మేకింగ్ లో తెరకెక్కాల్సిన ఓజీ కూడా ఇప్పుడు సీక్వెల్స్ దారిలోనే వెళ్లనుందట.
నిజానికి సాహో ను కూడా రెండు భాగాలుగా చిత్రీకరించాలనుకున్నాడు సుజిత్.
అయితే మొదటి భాగం ఫెయిల్యూర్ కావడంతో సాహో పార్ట్ -2 పై ఆశలు వదిలేసుకున్నాడు.
కాని ఓజీ విషయంలో అలా కాకుండా ముందు నుంచే పక్కా ప్లాన్ తో ముందుకెళ్లాలి అనుకుంటున్నాడు.
గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కావడంతో సర్దార్ గబ్బర్ సింగ్ లో నటించాడు పవన్.
అయితే ఈ సినిమా పవన్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్స్ లోఒకటిగా నిలిచింది.
మరి ఈ తప్పులను వీరమల్లు, ఓజీ విషయంలో రిపీట్ కాకుండా చూసుకుంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.