ఇండియన్ సినిమాకు సీక్వెల్ ద్వారా ఎలా కోట్లు కొల్లగొట్టవచ్చో చెప్పాడు రాజమౌళి.
బాహుబలి సిరీస్ తో వరల్డ్ వైడ్ రెండు వేల కోట్లను రాబట్టాడు.
రీసెంట్ గా ఇదే దారిలో వెళ్లిన పొన్నియిన్ సెల్వన్ కూడా ఫస్ట్ పార్ట్ తో 500 కోట్లు రాబట్టింది.
వేసవిలో విడుదలయ్యే రెండో భాగం బాహుబలి 2 రేంజ్ దుమ్మురేపుతుందని కోలీవుడ్ నమ్ముతోంది.
ఈ సంగతి ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ నటించే చిత్రాల్లో
ఒకటి రెండిటిని రెండు భాగాలుగా విడుదల చేయాలనుకుంటున్నారని
టాలీవుడ్ లో బాగా ప్రచారం సాగుతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సలార్ ను
రెండు భాగాలుగా విడుదల చేయనున్నారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది.
కేజీయఫ్ సిరీస్ దారిలోనే సలార్ కూడా రెండు భాగాలుగా రానుందని
ప్రశాంత్ నీల్ ఇదే సెంటిమెంట్ రిపీట్ చేస్తాడని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా తాను తెరకెక్కించబోతున్న ప్రాజెక్ట్ కే మూవీని
రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనుకుంటున్నాడట. త్వరలోనే అందుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ రానుందని పాన్ ఇండియా మార్కెట్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రాజెక్ట్ కే ను దాదాపు 500 కోట్లు బడ్జెట్ తోనిర్మిస్తున్నారు.
ఈ సినిమా బడ్జెట్ రికవర్ అయ్యి భారీగా బిజినెస్ జరగాలి అంటే రెండు భాగాలుగా రిలీజ్ చేస్తేనే బెటర్ అంటున్నారట దర్శకనిర్మాతలు.