త్రిబుల్ ఆర్ రిలీజై ఎన్ని రోజులైంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఎన్ని రోజులైంది.
ఇంకెప్పుడు తారక్ కొత్త సినిమా ప్రారంభిస్తాడు. కొరటాల రాసిన కథ నచ్చలేదు
మరో దర్శకుడికి అవకాశం ఇవ్వొచ్చు కదా. ఎందుకిలా సమయాన్ని వృధా చేస్తున్నారు అంటూ
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యంగ్ టైగర్ అభిమానులు. 2018లో అరవిందసమేత రిలీజైంది.
ఇప్పుడు 2023 కూడా వచ్చింది. ఐదేళ్ల కాలంలో తారక్ నుంచి ఒకే ఒక చిత్రం వచ్చింది అదే త్రిబుల్ ఆర్.
ఇప్పటికీ టైగర్ కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లకపోవడమే అభిమానులను ఎక్కువగా బాధపెడుతోంది.
కొరటాల రాసే కథ ఎప్పటికీ ఫైనల్ అయ్యేను ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది అంటూ వారు బాధపడుతున్నారు. ఫిబ్రవరి షూటింగ్ స్టార్టింగ్ అన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ ల్లో మూవీ రిలీజ్ అని ప్రకటించారు.
ఇప్పుడు ఫిబ్రవరిలో సినిమాను ఘనంగా ప్రారంభిస్తారట. మార్చిలో షూటింగ్ చేస్తారట.
ఈ మాటలో అయినా నిజం ఉంటుందా అని అభిమానుల సందేహం. అయినా ఆల్రెడీ బన్ని కోసం రాసుకున్న కథను
ఇఫ్పుడు తారక్ తో తెరకెక్కిస్తున్నప్పుడు సినిమాను తెరకెక్కించేందుకు కొరటాల ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నాడు అనేది అంతుబట్టకుండా ఉందంటున్నారు ఫ్యాన్స్.