బాలీవుడ్ లో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ ఖాన్స్ ను మాత్రమే బ్యాక్ బోన్ గా చెప్పుకొస్తారు.
అలా ఎందుకు చెప్పుకొస్తారో ఈరోజు షారుఖ్ మరోసారి నిరూపించాడు.
2016లో ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ ఎన్నో రికార్డులు తిరగరాసింది.
హిందీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ మూవీగా నిలిచింది.
చాలా ఏళ్లుగా దంగల్ రికార్డులు బద్దలు కొట్టే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ
ఏ హీరోకు సాధ్యపడలేదు. కాని షారుఖ్ అరుదైన ఫీట్ ను అందుకున్నాడు.
పఠాన్ తో దంగల్ పేరిట ఉన్న 387 కోట్ల వసూళ్లను చెరిపేసాడు.
మొత్తానికి దంగల్ రికార్డులు బద్దలు కొట్టేందుకు
బాలీవుడ్ కు 7 ఏళ్లు వేచి చూడాల్సివచ్చింది.
ప్రస్తుతం పఠాన్ పరుగు హిందీ వర్షన్స్ కేజీయఫ్ 2, అలాగే బాహుబలి 2 వైపు ఉంది.
మరో వైపు పఠాన్ ఎంత కొల్లగొట్టినా ఆ రికార్డులను
ఇదే ఏడాది బాక్సాఫీస్ బరిలోకి దిగనున్న టైగర్ -3 సినిమాతో
సల్మాన్ తిరగరాస్తాడనే ప్రచారం ఉంది.
పైగా టైగర్ -3లో పఠాన్ కూడా కొద్ది సేపు కనిపించబోతున్నాడు.
ఏది ఏమైనా ఖాన్స్ కమ్ బ్యాక్ అంటూ ఇస్తే
బాలీవుడ్లో మిగితా హీరోలకు చోటు ఇవ్వరు.
వాళ్లలో వాళ్లే బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాస్తుంటారు.