మైదానంలో నోరు పారేసుకోవడంలో ఆసిస్ క్రికెటర్లు దిట్టలు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రత్యర్థులను కవ్విస్తుంటారు. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వేళ కూడా కంగారులు ఆ ట్రిక్స్ మొదలు పెట్టారు. భారత్‌పై తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. మరికొన్ని గంటల్లో జరగనున్న నాగ్‌పూర్ మ్యాచ్‌కు సంబంధించి పిచ్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ లో భాగంగా రేపటి నుంచి నాగ్‌పూర్ వేదికగా టీమిండియా ఆస్ట్రేలియాల మధ్య తొలి టెస్టు ప్రారంభమవుతోంది. ఈ క్రమంలో సిరీస్ మొదలవడానికి ముందు నుంచే ఆస్ట్రేలియా మాజీలంతా భారత్‌లో పిచ్‌లపై విమర్శలు గుప్పిస్తున్నారు. భారత్ తమకు అనుకూలంగా పిచ్ రెడీ చేసుకుంటోందంటూ కొద్దిరోజులుగా ఆ జట్టు ఆటగాళ్లతో పాటు మాజీలు మాట్లాడేస్తున్నారు. అందుకు ప్రతిగా మనోళ్లు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఈ ఆరోపణలకు టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ ధీటుగా బదులిచ్చాడు. పిచ్‌పై కాదు ఆటపై దృష్టిపెట్టాలని ఆసిస్‌కు సూచించాడు. నాగ్‌పూర్ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుందని ఈ పరిస్థితుల్లో స్ట్రైక్ రొటేట్ చేయడం ఎంతో ముఖ్యమని పేర్కొన్నాడు.
నాగ్‌పూర్ పిచ్‌ను తయారు చేసే సమయంలో క్యురేటర్లు పూర్తిగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను దృష్టిలో పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఈ పిచ్‌కు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పిచ్‌లో అనుకున్నంత బౌన్స్ ఉండబోదని ఇప్పటికే ఆసీస్ జట్టులోని ఎక్స్పర్టులు చెప్పేశారు. అలాగే స్పిన్నర్లకు పిచ్ నుంచి మంచి సహకారం లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా జట్టులోని తొలి 8 మంది బ్యాటర్లలో ఐదుగురు లెఫ్ట్ బ్యాండ్ బ్యాటర్లే. వాళ్లు నాగ్‌పూర్ పిచ్‌పై భారీ స్కోర్లు చేయడం చాలా కష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎడం చేతి వాటం బ్యాటర్ల ఆఫ్‌స్టంప్ వైపు భాగాన్ని క్యురేటర్లు పూర్తిగా పొడిగా ఉంచేశారు. అలాగే పిచ్ మధ్యలో చక్కగా తడిపిన వాళ్లు కుడిచేతి వాటం బ్యాటర్ల ఆఫ్‌స్టంప్ వద్ద కొద్దిగానే తడిపారు. రోలింగ్ చేసే సమయంలో కూడా మధ్య వరకే చేసినట్లు కొందరు చెప్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈ పిచ్‌పై ఎడం చేతి వాటం బ్యాటర్లు ముఖ్యంగా స్పిన్ ఆడటానికి కష్టపడే లెఫ్ట్ హ్యాండర్లకు తిప్పలు తప్పేలా లేవు. మరి ఆస్ట్రేలియా బ్యాటర్లు ఈ సవాల్‌ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
ఈ పిచ్‌కు సంబంధించిన ఫొటోలు చూసిన వెంటనే ఆస్ట్రేలియా మాజీలు ఆగ్రహంతో ఊగిపోయారు. భారత్ ఇలాంటి చెత్త పిచ్‌లు తయారు చేసి మ్యాచులు గెలవడం సమంజసం కాదని మండిపడ్డారు. ఈ పిచ్ తయారు చేసిన క్యురేటర్లు టీమిండియాకు లబ్ది చేకూర్చాలనే కుట్రతోనే దీన్ని తయారు చేశారని క్రికెట్ నిపుణుడు రాబర్ట్ క్రాడూక్ ఆరోపించాడు. పిచ్ డ్రైగా ఉందని లెఫ్టార్మ్ స్పిన్నర్లకు ఎక్కువ సహకరించే అవకాశం ఉందని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. నాగ్‌పూర్ పిచ్ ఆస్ట్రేలియా లెప్ట్ హ్యాండర్లకు పరీక్షగా నిలుస్తుందని పలువురు సోషల్ మీడియాలో కూడా విశ్లేషిస్తున్నారు. వాళ్లను టార్గెట్ చేస్తూనే ఈ పిచ్ తయారు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత్ ఇలా చేసినప్పుడు ఐసీసీ చర్యలు తీసుకోవాలని కానీ ఎప్పుడూ ఐసీసీ అలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదంటూ కంగారులు కంగారు పడిపోతున్నారు. ఏది ఏమైనా ఆస్ట్రేలియా భారత్ జట్ల ఆటగాళ్ల మధ్య కవ్వింపులు మాటల యుద్ధాలు సహజమేనని అంతా లైట్ తీసుకుంటున్నారు. భారత్‌లో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ జరిగిన ప్రతిసారీ ఆతిథ్య జట్టుపై ఇలాంటి ఆరోపణలు చేయడం సహజమేనని పలువురు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం టీమిండియాను టీమ్ సెలక్షన్ పట్టి పీడిస్తోంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. దీంతో అయ్యర్ పంత్ స్థానాలను భర్తీ చేయాల్సిన అవసరం మాత్రమే మిగిలింది. పంత్ స్థానంలో ఇషాన్ కిషన్, కేఎస్ భరత్‌లలో ఒకరికి చోటు దక్కుతుంది. ఈ విషయంలో భరత్‌కే ఓటెయ్యాలని టీం మేనేజ్మెంట్ భావిస్తోందట. దీంతో ఇక మిగిలింది కేవలం ఐదో స్థానమే. ఈ స్థానం కోసం శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ పోటీ పడుతున్నారు. పంత్ లేకపోవడంతో టీమిండియా బ్యాటింగ్‌లో ఫైర్ పవర్ తగ్గినట్లు కనిపిస్తోంది. దీన్ని పూరించుకోవడానికి సూర్యకు అవకాశం ఇవ్వాలని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను బట్టి గిల్‌ను ఆడించాలని మరికొందరు అంటున్నారు. అంతేకాదు స్పిన్‌ను ఎదుర్కోవడంలో గిల్ కూడా సమర్ధేడే అని దానికితోడు లిస్ట్-ఎ క్రికెట్లో మిడిలార్డర్లో గిల్ డబుల్ సెంచరీ కూడా బాదాడని గుర్తు చేస్తున్నారు.