పవర్ స్టార్ ఫుల్ ఫోర్స్ తో వస్తున్నాడు. అయితే అది రాజకీయాల్లోకి
వారాహితో ప్రజా క్షేత్రంలోకి కాదు. అందుకు ఇంకా సమయం ఉంది.
ఈలోపు తాను చేయాల్సిన సినిమాలను ఘనంగా ప్రారంభించి
ఎప్పుడు వీలైతే అప్పుడు సినిమా షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నాడు.
ముందుగా డిసెంబర్ లో గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్
మేకింగ్ లో తెరకెక్కాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ప్రారంభించాడు.
ఆ తర్వాత జనవరిలో సుజిత్ దర్శకత్వంలో పట్టాలెక్కిన ఓజీని స్టార్ట్ చేసాడు.
ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాను ఫిబ్రవరి 14న ప్రారంభించబోతున్నాడు.
తమిళంలో విడుదలైన వినోదయ సిత్తం సినిమాకు తెలుగు రీమేక్ లో పవన్ నటిస్తున్నాడు.
ఇందులో సాయి ధరమ్ తేజ్ హీరో అయితే గతంలో గోపాల గోపాలా లాంటి చిత్రంలో చేసినటువంటి పాత్రను
ఇందులో పవన్ పోషించబోతున్నాడు. తమిళ వర్షన్ ను తెరకెక్కించిన సముద్రఖని డైరెక్ట్ చేయబోతున్నాడు.
అయితే స్క్రిప్ట్ ను మాటలను స్క్రీన్ ప్లేను త్రివిక్రమ్ అందించే అవకాశాలు ఉన్నాయి.
సాయిధరమ్ తేజ్ సరసన కేతిక శర్మా నటించనుంది.