పఠాన్ తో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు షారుఖ్. దాంతో బాలీవుడ్ నెం.1 చైర్ ను తిరిగి అందున్నాడు.
అందుకే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఎక్కడా క్రేజ్ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
పఠాన్ తర్వాత జవాన్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఆ తర్వాత రాజ్ కుమార్ హిరాణి మేకింగ్ లో డంకీ రానుంది.
ఈ మూడు చిత్రాల తర్వాత షారుఖ్ చేయబోయే సినిమాలు ఇంతకంటే ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి.
అందులో ఒక ప్రాజెక్ట్ శంకర్ తో ఉండనుంది అనేది సమాచారం. ప్రస్తుతం శంకర్ ఇటు భారతీయుడు -2 అటు రామ్ చరణ్ తో చిత్రాలు తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండూ వచ్చే ఏడాదికి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తాయి.
ఆ తర్వాత వేల్పరి అనే సినిమా ప్లాన్ చేస్తున్నాడు శంకర్. అయితే అందుకు ఇంకా సమయం ఉంది.
దాంతో షారుఖ్ విజయ్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట మెగా మేకర్.
పైగా ఈ మూవీని పూర్తిగా గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కించాలనుకుంటున్నారట.
అందుకోసం దాదాపు 1000 కోట్ల బడ్జెట్ లాక్ చేసారట. ఏది ఏమైనా పాన్ ఇండియా మూవ్ మెంట్ స్టార్ట్ అయిన తర్వాత
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గతంలో ఎన్నడూ చూడని కాంబినేషన్ చూడబోతోంది.
అన్నట్లు మరో విశేషం షారుఖ్ నటిస్తున్న జవాన్ లో విజయ్ కొద్దినిముషాల పాటు కనిపించబోతున్నాడు.
సో శంకర్ మూవీ కంటే ముందే వీరి కాంబినేషన్ ను జవాన్ లో చూడబోతున్నాం అనమాట.