ఎప్పుడు చూసిన వేడి వేడిగా అనే మాట చెబుతూ సినిమా సెట్ లో సందడి చేస్తూ మాటకు ముందు నాన్నగారు
మాట తర్వాత నాన్నగారి జ్ఞాపకాలు చెప్పుకొస్తూ ఉండే బాలయ్యకు ఓ నిర్మాత కోపం తెప్పించాడు.
ఆ నిర్మాత పేరు ఇక్కడ అనవసరం. ఇంతకీ ఆ నిర్మాత ఏం చేసాటంటే
బాలకృష్ణను కలసి కొత్త సినిమా షూటింగ్ డేట్స్ ఫిక్స్ చేయమని అడిగాడట.
దాంతో బాలయ్య కోపం కట్టలు తెంచుకుందట. ఒక వైపు తన కుటుంబ సభ్యుడు బంధువు తారకరత్న ఆసుపత్రిలో
చలనం లేకుండా పడి ఉన్నాడు. ఈ దశలో షూటింగ్ అంటావు ఏంటి అంటూ సదరు నిర్మాతపై సీరియస్ అయ్యాడట.
అంతే కాదు మరో నెల రోజుల వరకు షూటింగ్ ప్రస్తానవ తన దగ్గరికి తీసుకురావద్దని చెప్పాడట.
దాంతో ఆ నిర్మాత సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయాడట. ఈ సంగతి ఇలా ఉంటే ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి మేకింగ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. కాజల్ ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా నటించనుంది.