పోస్ట్ కోవిడ్ యంగ్ హీరోస్ కు బాక్సాఫీస్ అస్సలు కలసి రావడం లేదు. దాంతో డీలా పడిపోతున్నారు.
లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి సందీప్ కిషన్ చేరాడు. ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో బడ్జెట్ కేటాయించి
నిర్మించిన మైఖెల్ ను పాన్ ఇండియాలో ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా పట్టించుకోలేదు.
దాంతో చాలా డిజప్పాయింట్ అయ్యాడు ఈ యంగ్ హీరో.
సినిమాలో విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ
ఎందుకో ఈ సినిమా చూసేందుకు ఆడియెన్స్ ఆశక్తి చూపించలేదు.
కనీసం మంచి ఓపెనింగ్స్ కూడా అందుకోలేకపోయింది.
అందుకే సందీప్ కిషన్ మరో మూవీ ప్లానింగ్ లో ఉన్నాడు.
తన ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ దేవకట్టాతో కలసి మూవీ చేయాలనుకుంటున్నాడు.
టాలీవుడ్ సర్కిల్స్ లో ఈ మూవీని ప్రస్థానం సీక్వెల్ అని ప్రచారం సాగుతోంది.
రిపబ్లిక్ పరాజయం తర్వాత దేవకట్టా టైమ్ తీసుకుని తయారు చేసిన సబ్జెక్ట్ ఇది.
అయితే ఇది ప్రస్థానం సీక్వెల్ మూవీనా కాదా అన్నది మరికొద్ది రోజులు ఆగితే తెల్సిపోతుంది.
ప్రస్థానం సీక్వెల్ అయితే శర్వానంద్ కూడా నటిస్తాడేమో చూడాలి.