ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో రిలీజైంది తెగింపు మూవీ. తెలుగు తమిళ హిందీ భాషల్లో నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉంది. దాంతో ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు నెటిజన్స్.
ఇండియా దాటి విదేశాల్లో సైతం అజిత్ సినిమాకు బ్రహ్మరథం పడుతుండటం
అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి
కంట్యూయెస్ గా ట్రెండింగ్ లో ఉండటం ముందు నుంచి హాట్ టాపిక్ గా మారింది.
ముఖ్యంగా బాలీవుడ్ నుంచి అలాగే కొన్ని కంట్రీస్ నుంచి ఈ సినిమా పై అద్భుతమైన స్పందన కనిపిస్తోంది.
గతంలో ఇలాంటి రెస్పాన్స్ త్రిబుల్ ఆర్ కు మాత్రమే కనిపించింది.
అజిత్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ డిజిటల్ రైట్స్ పెట్టి కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్.
వారికి ఈ డీల్ బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. మొత్తంగా తమిళ దర్శకుడు వినోద్ తెరకెక్కించిన
ఈ హీస్ట్ డ్రామా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చి దళపతి విజయ్ నటించిన వారసుడితో పోటీ పడి
250 కోట్ల భారీ వసూళ్లను అందుకుంది. కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బిగ్ హిట్ గా నిలిచింది.
ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో షేక్ చేస్తోంది. తెగింపుకు ఇలాంటే క్రేజ్ కంటిన్యూ అయితే మాత్రం
రాబోయే రోజుల్లో నయా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం.