కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే టార్గెట్ చేస్తున్న కేసీఆర్ కు షాక్ తగిలిందా ? బీజేపీ సర్కార్ కొట్టిన దెబ్బకు…కేసీఆర్ విలవిలలాడిపోవాల్సిందేనా ? ప్రధాన మంత్రి మోదీ… కేసీఆర్ కు అప్పులు పుట్టకుండా చేశారా ? మోదీ సర్కార్… ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కోలా ట్రీట్ చేస్తోంది. తమకు అనుకూలంగా ఉన్న వారికి అడగ్గానే…అప్పు తీసుకునేందుకు అనుమతులు ఇచ్చేస్తోంది. వ్యతిరేకించిన వారికి మాత్రం… అప్పులు పుట్టకుండా అనేక రకాలు ఇబ్బందులు పెడుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి ఒకటి తలిస్తే…ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరొకటి తలిచారు. కేసీఆర్ ను ఒక్క మాట కూడా అనకుండానే… చుక్కలు చూపిస్తున్నారు ప్రధాన మంత్రి మోదీ. తెలంగాణ ప్రతిపాదించిన అప్పులను…సగానికి తగ్గించి కొలుకోలేని విధంగా దెబ్బకొట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి…2 లక్షల 56 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి హరీశ్ రావు…. దాదాపు 54 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటామని ప్రభుత్వం ప్రతిపాదించింది. సాగు నీటి ప్రాజెక్టుల కార్పొరేషన్లకు 23వేల కోట్లు, విద్యుత్ సంస్థలకు 12 వేల కోట్లు తీసుకుంటామని ప్రస్తావించింది. బడ్జెట్ లోని అప్పులు, గ్యారెంటీ అప్పులు కలిపి 88 వేల 843 కోట్లు చెప్పింది. మోదీ సర్కార్ నుంచి 40 వేల కోట్ల దాకా గ్రాంట్ల రూపంలో వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అంచనా వేశారు. అన్ని కలిపితే లక్షా 20 వేల కోట్లు. అయితే తెలంగాణ ప్రభుత్వం 54వేల కోట్లు అంచనా వేస్తే… కేంద్రం మాత్రం 23 వేలు కోట్లు మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది. అంటే బడ్జెట్ లో ప్రస్తావించిన విధంగా… సగం కూడా ఇవ్వబోమని తేల్చేసింది మోదీ సర్కార్.
గ్యారెంటీ అప్పుల కింద 10వేల కోట్లు, గ్రాంట్లు మరో పది వేల కోట్లకు మించి ఉండకపోవచ్చని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్రం ఇచ్చే అప్పులు, గ్యారెంటి అప్పులు, గ్రాంట్లు కలిపితే… తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేది 43వేల కోట్ల రూపాయలు మాత్రమే. ముఖ్యమంత్రి కేసీఆర్ 80వేల కోట్లకు పైగా వస్తుందనుకుంటే… అందులో సగమేనని తేలిపోయింది. దీంతో దెబ్బతో కోతపడిన మొత్తాన్ని ఎలా భర్తీ చేయాలన్న దానిపై తెలంగాణ ప్రభుత్వం మల్లాగుల్లాలు పడుతోంది. వివిధ పన్నుల రూపంలో రాష్ట్రానికి… ప్రతి నెల 10వేల కోట్లు ఆదాయం వస్తున్నా…భవిష్యత్ లో తగ్గిపోయే అవకాశం ఉంది. రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏడాది లక్షా 20 వేల కోట్లు, కేంద్రం అప్పులు, గ్యారెంటీ అప్పులు కలిపితే లక్షా 63 కోట్లు అవుతుంది. ప్రభుత్వం 2.56 లక్షల బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాదాపు 90 వేల కోట్లు కోతపడింది.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయ్. రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు పథకాలకు…నిధులు కొరత రాకుండా చూసుకోవాలి. నిధులు లేవని ఇప్పుడు పథకాల్లో కోతలు విధిస్తే…ప్రజలనుంచి వ్యతిరేకత తప్పదు. పథకాలన్నీ కొనసాగించాలంటే…వేల కోట్ల రూపాయలు కావాలి. 8 ఏళ్లలో ఒక్క పైసా డిఫాల్ట్ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు తెలంగాణ సొంతం. ఆర్బీఐ వేసే బిడ్లలో తెలంగాణకే ఎక్కువ డిమాండ్ ఉంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ను అప్పు అడిగినా…కేంద్రం అడ్డుపుల్ల వేసింది. దేశంలో అన్ని రాష్ట్రాలు సమానమేనంటోన్న కేంద్రం… అప్పుల్లో కూరుకుపోయిన ఏపీకి కొత్త రుణాల కోసం అనుమతులు ఇస్తూనే ఉంది. పక్కనున్న తెలంగాణ మాత్రం కొర్రీలు వేస్తోంది. జగన్ సర్కార్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటోన్న కేంద్రం…కేసీఆర్ ప్రభుత్వానికి అడుగడుగునా మొకాలడ్డుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములను అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందిన సర్కార్. భూముల అమ్మకం ద్వారానే…భారీగా నిధులు సమకూర్చుకోవాలని భావిస్తోంది. అటు ఇప్పటికే భూముల ధరలను పెంచేసిన కేసీఆర్…మరోసారి అదే పని చేసే అవకాశం ఉంది.
ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో…శ్రీలంక పరిస్థితిపై కేంద్రం ప్రజెంటేషన్ ఇచ్చింది. శ్రీలంకలో ప్రస్తుత సంక్షోభానికి రాజకీయ పరిస్థితులతో పాటు స్థాయికి మించి అపరిమితంగా అప్పులేనంటూ వెల్లడించింది. రాజకీయ దురుద్దేశంతోనే…తెలంగాణపై లేని పోని ఆరోపణలు చేస్తోందంటూ కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిమితికి మించి కేంద్రం చేసే అప్పుల వివరాల్ని ప్రజలుకు చెప్పాలంటూ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు నిలదీశారు.