మహేష్ నెక్ట్స్ ఫిల్మ్ ఆగస్ట్ లోనే రిలీజ్ ఇంతకీ రీజన్ ఏంటి

By KTV Telugu On 15 February, 2023
image

మహేష్ మూవీ అనగానే ఫెస్టివల్ టైమ్ కు వస్తాడు అని ఫిక్స్ అయిపోతారు ఫ్యాన్స్. సంక్రాంతికి లేదా దసరాకు ఎక్కువగా వచ్చాడు ప్రిన్స్. లేదా కాస్త అటూ ఇటూగా అయితే సమ్మర్ లో బాక్సాఫీస్ బరిలోకి దిగుతాడు.
త్రివిక్రమ్ సినిమాను ఇందుకు భిన్నంగా ఆగస్ట్ లోనే విడుదల ప్లాన్ చేస్తున్నారు మహేష్.
అందుకు మెయిన్ రీజన్ సెంటిమెంట్ అని తెలుస్తోంది. 2004లో విడుదలైన అర్జున్
2005లో వచ్చిన అతడు ఆగస్ట్ నెలలోనే రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత చాలా కాలానికి 2015లో శ్రీమంతుడు చిత్రాన్ని
ఆగస్ట్ లో రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు మహేష్ బాబు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఏడాది త్రివిక్రమ్ మూవీని ఆగస్ట్ లో రిలీజ్ చేస్తున్నాడు. ఈ సంగతి ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ అండ్ ఇతర స్టార్ కాస్ట్ పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించేందుకు త్రివిక్రమ్ ఒక ఇంటి సెట్ వేయిస్తున్నాడు. అందుకోసం దాదాపు 10కోట్లు వెచ్చిస్తున్నారు.
ఇక విలన్ గా నటిస్తున్న జగపతి బాబు కెరీర్ లోనే మలుపు తిప్పే పాత్రను చేస్తున్నాడట.
ఆగస్ట్ లో రిలీజైన శ్రీమంతుడు రోజులను ఈచిత్రం మరోసారి గుర్తుచేయాలని గుర్తు చేస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.