లాస్ట్ ఇయర్ గార్గి, విరాటపర్వం చిత్రాల్లో నటించిన తర్వాత ఒక్కసారిగా మాయం అయింది సాయి పల్లవి.
ఇక సినిమాలు మానేస్తుందని సొంతూరిలో హాస్పటల్ కట్టుకుందని డాక్టర్ గా సేవలు కొనసాగిస్తోందని
చాలా పుకార్లు వినిపించాయి. తర్వాత సాయి పల్లవి కూడా వీటిపై స్పందించింది. అవన్ని పుకార్లే అంటూ కొట్టిపారేసింది.
కొత్త ఏడాది వచ్చేసింది. దాంతో సాయి పల్లవి కూడా ఇక షూటింగ్ లో అడుగు పెట్టాలనుకుంటోంది.
తమిళంలో ఒక సినిమా ఒప్పుకున్నప్పటీకీ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈలోపు మాలీవుడ్ నుంచి ఆఫర్ రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. 8 ఏళ్లక్రితం మలయాళంలో సంచలనం విజయం సాధించిన ప్రేమమ్ కాంబినేషన్ లో మరో మూవీ చేయనుంది సాయి పల్లవి. ఈ మూవీలో నివిన్ పౌలీతో మరోసారి కలసి నటించనుంది.
పుష్ప2లో సైతం సాయి పల్లవి కనిపించనుందని వార్తలు షికార్లు చేసాయి.
అయితే చిత్ర యూనిట్ ఇంత వరకు అఫీసియల్ కన్ ఫర్ మేషన్ ఇవ్వలేదు