డైరెక్టర్ శంకర్ తన కెరీర్ లో బిగ్ రిస్క్ తీసుకుంటున్నాడు.
ఒక వైపు కోలీవుడ్ ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు.
మరో వైపు టాలీవుడ్ ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నాడు.
కమల్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా బడ్జెట్ 300 కోట్లు అని సమాచారం.
అదే విధంగా రామ్ చరణ్ మూవీ బడ్జెట్ కూడా 300 కోట్లు అట.
దేశంలో ఒక శంకర్ మాత్రమే ఇలాంటి సాహసాలు చేయగలడేమో
ఇన్ని వందల కోట్లరూపాయల సినిమాలను అవలీలగా తెరకెక్కిస్తున్న శంకర్ ను,
చూసి మిగితా ఇండియన్ డైరెక్టర్స్ ఆశ్చర్యపోతున్నారు.
అన్నిటికంటే మించి శంకర్ ఎనర్జీ ఫిదా చేస్తోంది.
లాస్ట్ వీక్ అంతా తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన ప్రాంతాల్లో చరణ్ సినిమాకు సంబంధించిన పాటను చిత్రీకరించాడు.
కట్ చేస్తే ఇప్పుడు చెన్నైలో ఒక స్టూడియోలో వేసిన భారీ సెట్ లో
కమల్ పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు.
దాదాపు నెల రోజుల పాటు ఈ చిత్రీకరణ నిర్విరామంగా కొనసాగనుంది.
దీపావళి పండక్కి భారతీయుడు -2 చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాడు శంకర్.
అదే విధంగా రామ్ చరణ్ మూవీని వచ్చే సంక్రాంతి పండక్కి సిద్ధం చేయాలని నిర్మాత దిల్ రాజు తో ఒప్పందం కుదుర్చుకున్నాడు శంకర్